بَرَاءَةٌ مِّنَ اللَّهِ وَرَسُولِهِ إِلَى الَّذِينَ عَاهَدتُّم مِّنَ الْمُشْرِكِينَ1
అల్లాహ్ తరఫు నుండి, ఆయన ప్రవక్త తరఫు నుండి మీరు ఒడంబడికలు చేసుకున్న ముష్రిక్కు లకు విముక్తి ప్రకటించబడుతోంది.
Syed Abul Aala Maudoodi
فَسِيحُوا فِي الْأَرْضِ أَرْبَعَةَ أَشْهُرٍ وَاعْلَمُوا أَنَّكُمْ غَيْرُ مُعْجِزِي اللَّهِ ۙ وَأَنَّ اللَّهَ مُخْزِي الْكَافِرِينَ2
కనుక మీరు దేశంలో స్వేచ్ఛగా ఇంకా నాలుగు నెలలు తిరగండి. మీరు అల్లాహ్ ను అశక్తుడుగా చెయ్యలేరని తెలుసుకోండి. అల్లాహ్ సత్యతిరస్కారులను పరాభవంపాలు చేస్తాడు.
Syed Abul Aala Maudoodi
وَأَذَانٌ مِّنَ اللَّهِ وَرَسُولِهِ إِلَى النَّاسِ يَوْمَ الْحَجِّ الْأَكْبَرِ أَنَّ اللَّهَ بَرِيءٌ مِّنَ الْمُشْرِكِينَ ۙ وَرَسُولُهُ ۚ فَإِن تُبْتُمْ فَهُوَ خَيْرٌ لَّكُمْ ۖ وَإِن تَوَلَّيْتُمْ فَاعْلَمُوا أَنَّكُمْ غَيْرُ مُعْجِزِي اللَّهِ ۗ وَبَشِّرِ الَّذِينَ كَفَرُوا بِعَذَابٍ أَلِيمٍ3
పెద్ద హజ్ రోజున సమస్త ప్రజలకు అల్లాహ్ తరఫు నుండీ ఆయన ప్రవక్త తరఫు నుండీ చెయ్యబడే బహిరంగ ప్రకటన ఏమిటంటే, అల్లాహ్ ముష్రిక్కులకు ఏ విధంగానూ బాధ్యుడు కాడు అలాగే ఆయన ప్రవక్త కూడా. ఇప్పుడు మీరు గనక పశ్చాత్తాపపడితే అది మీకే మేలు. ఒకవేళ విముఖులైతే మీరు అల్లాహ్ ను అశక్తుడుగా చెయ్యలేరు అని బాగా అర్థం చేసుకోండి. ప్రవక్తా! తిరస్కరించేవారికి కఠినశిక్షను గురించిన శుభవార్తను వినిపించు,
Syed Abul Aala Maudoodi
إِلَّا الَّذِينَ عَاهَدتُّم مِّنَ الْمُشْرِكِينَ ثُمَّ لَمْ يَنقُصُوكُمْ شَيْئًا وَلَمْ يُظَاهِرُوا عَلَيْكُمْ أَحَدًا فَأَتِمُّوا إِلَيْهِمْ عَهْدَهُمْ إِلَىٰ مُدَّتِهِمْ ۚ إِنَّ اللَّهَ يُحِبُّ الْمُتَّقِينَ4
మీరు ఒడంబడికలు కుదుర్చుకున్న ముష్రిక్కులకు తప్ప. ఎందుకంటే వారు తమ ఒడంబడికలు నెరవేర్చటంలో మీపట్ల ఏ లోపమూ చేయలేదు, మీకు వ్యతిరేకంగా ఎవరికీ సహాయం చేయలేదు అటువంటి వారితోపాటు మీరు కూడా ఒడంబడికను గడువు వరకు పాటించండి. ఎందుకంటే, అల్లాహ్ భయభక్తులు గలవారంటేనే ఇష్టపడతాడు.
Syed Abul Aala Maudoodi
فَإِذَا انسَلَخَ الْأَشْهُرُ الْحُرُمُ فَاقْتُلُوا الْمُشْرِكِينَ حَيْثُ وَجَدتُّمُوهُمْ وَخُذُوهُمْ وَاحْصُرُوهُمْ وَاقْعُدُوا لَهُمْ كُلَّ مَرْصَدٍ ۚ فَإِن تَابُوا وَأَقَامُوا الصَّلَاةَ وَآتَوُا الزَّكَاةَ فَخَلُّوا سَبِيلَهُمْ ۚ إِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ5
కనుక, నిషిద్ధ మాసాలు గడిచిపోయిన తర్వాత ముష్రిక్కులను చంపండి, ఎక్కడ కనిపిస్తే అక్కడ, ఇంకా వారిని పట్టుకోండి, చుట్టుముట్టండి, ప్రతి మాటువద్ద వారి కొరకు పొంచి కూర్చోండి. తరువాత ఒకవేళ వారు పశ్చాత్తాపపడితే, నమాజును స్థాపిస్తే, జకాత్ ఇస్తే, వారిని విడిచిపెట్టండి. అల్లాహ్ మన్నించేవాడూ, కరుణించేవాడూను.
Syed Abul Aala Maudoodi
وَإِنْ أَحَدٌ مِّنَ الْمُشْرِكِينَ اسْتَجَارَكَ فَأَجِرْهُ حَتَّىٰ يَسْمَعَ كَلَامَ اللَّهِ ثُمَّ أَبْلِغْهُ مَأْمَنَهُ ۚ ذَٰلِكَ بِأَنَّهُمْ قَوْمٌ لَّا يَعْلَمُونَ6
ఒకవేళ ముష్రిక్కులలో ఏ వ్యక్తి అయినా శరణుగోరి మీ వద్దకు రాదలిస్తే (అల్లాహ్ గ్రంథాన్ని వినటానికీ), అతనికి శరణు ఇవ్వండి, అతడు అల్లాహ్ గ్రంథాన్ని వినే అంతవరకు. తరువాత అతనిని అతని భద్రతాస్థలం వరకు చేర్చండి. ఇలా ఎందుకు చెయ్యాలంటే, వారికి గ్రంథ జ్ఞానము లేదు కాబట్టి.
Syed Abul Aala Maudoodi
كَيْفَ يَكُونُ لِلْمُشْرِكِينَ عَهْدٌ عِندَ اللَّهِ وَعِندَ رَسُولِهِ إِلَّا الَّذِينَ عَاهَدتُّمْ عِندَ الْمَسْجِدِ الْحَرَامِ ۖ فَمَا اسْتَقَامُوا لَكُمْ فَاسْتَقِيمُوا لَهُمْ ۚ إِنَّ اللَّهَ يُحِبُّ الْمُتَّقِينَ7
ఈ ముష్రిక్కులకు అల్లాహ్ వద్ద ఆయన సందేశహరునివద్ద ఒడంబడిక అనేది అసలు ఎలా సాధ్యం? - మీరు ‘మస్జిదె హరామ్’ వద్ద ఒడంబడిక చేసుకున్నవారితో తప్ప. వారు మీతో సరిగ్గా ఉన్నంతవరకు మీరూ వారితో సరిగ్గా ఉండండి. ఎందుకంటే అల్లాహ్ భయభక్తులు కలవారంటే ఇష్టపడతాడు
Syed Abul Aala Maudoodi
كَيْفَ وَإِن يَظْهَرُوا عَلَيْكُمْ لَا يَرْقُبُوا فِيكُمْ إِلًّا وَلَا ذِمَّةً ۚ يُرْضُونَكُم بِأَفْوَاهِهِمْ وَتَأْبَىٰ قُلُوبُهُمْ وَأَكْثَرُهُمْ فَاسِقُونَ8
కానీ వారితో తప్ప, ఇతర ముష్రిక్కులతో ఏ ఒడంబడికైనా ఎలా సాధ్యం, వారి పరిస్థితి ఇలా ఉన్నప్పుడు? అంటే మీపై ప్రాబల్యం వహిస్తే మీ విషయంలో ఏ బంధుత్వాన్నీ లెక్కచెయ్యరు, ఏ ఒడంబడిక బాధ్యతనూ ఖాతరుచెయ్యరు, వారు నోటిమాటలతో మిమ్మల్ని సమాధానపరచటానికి ప్రయత్నిస్తారు. కాని వారి మనస్సులు మాత్రం తిరస్కరిస్తాయి. వారిలో చాలామంది దుర్మార్గులు.
Syed Abul Aala Maudoodi
اشْتَرَوْا بِآيَاتِ اللَّهِ ثَمَنًا قَلِيلًا فَصَدُّوا عَن سَبِيلِهِ ۚ إِنَّهُمْ سَاءَ مَا كَانُوا يَعْمَلُونَ9
వారు అల్లాహ్ ఆయతులను అల్పధరకు విక్రయించారు. అంతేకాదు, అల్లాహ్ మార్గంలో అవరోధమై నిల్చున్నారు. వారు చేసినవి బహుచెడ్డచేష్టలు.
Syed Abul Aala Maudoodi
لَا يَرْقُبُونَ فِي مُؤْمِنٍ إِلًّا وَلَا ذِمَّةً ۚ وَأُولَـٰئِكَ هُمُ الْمُعْتَدُونَ10
ఏ విశ్వాసి విషయం లోనైనా వారు బంధుత్వాన్నిగానీ, ఒడంబడిక బాధ్యతనుగానీ లెక్కచెయ్యరు. అతిక్రమణ అనేది ఎల్లప్పుడూ వారి వైపునుండే జరిగింది.
Syed Abul Aala Maudoodi