بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

అద్-దుహా

وَالضُّحَىٰ1

వెలుగు విరజిమ్మే పగలు సాక్షిగా!

Syed Abul Aala Maudoodi

అద్-దుహా

وَاللَّيْلِ إِذَا سَجَىٰ2

ప్రశాంతంగా ఆవరించే రాత్రి సాక్షిగా!

Syed Abul Aala Maudoodi

అద్-దుహా

مَا وَدَّعَكَ رَبُّكَ وَمَا قَلَىٰ3

(ఓ ప్రవక్తా!) నీ ప్రభువు నిన్ను ఏమాత్రం విడనాడలేదు, నీ పట్ల ఆయన అసంతృప్తిచెందనూ లేదు.

Syed Abul Aala Maudoodi

అద్-దుహా

وَلَلْآخِرَةُ خَيْرٌ لَّكَ مِنَ الْأُولَىٰ4

నిశ్చయంగా రాబోయే కాలం నీ కొరకు గత కాలం కన్నా మేలైనదిగా ఉంటుంది.

Syed Abul Aala Maudoodi

అద్-దుహా

وَلَسَوْفَ يُعْطِيكَ رَبُّكَ فَتَرْضَىٰ5

త్వరలోనే నీకు నీ ప్రభువు నీవు సంతోషపడే అంత అధికంగా ప్రసాదిస్తాడు.

Syed Abul Aala Maudoodi

అద్-దుహా

أَلَمْ يَجِدْكَ يَتِيمًا فَآوَىٰ6

నీవు అనాథుడుగా ఉండటం చూసి ఆయన నీకు ఆశ్రయం కల్పించలేదా?

Syed Abul Aala Maudoodi

అద్-దుహా

وَوَجَدَكَ ضَالًّا فَهَدَىٰ7

నీవు మార్గమేదో తెలియని వాడవుగా ఉన్నప్పుడు ఆయన నీకు సన్మార్గం చూపించాడు.

Syed Abul Aala Maudoodi

అద్-దుహా

وَوَجَدَكَ عَائِلًا فَأَغْنَىٰ8

నీవు నిరుపేదగా ఉన్నప్పుడు, ఆయన నిన్ను ధనవంతుడుగా చేశాడు.

Syed Abul Aala Maudoodi

అద్-దుహా

فَأَمَّا الْيَتِيمَ فَلَا تَقْهَرْ9

కావున నీవు అనాథులపట్ల కఠినంగా ప్రవర్తించకు.

Syed Abul Aala Maudoodi

అద్-దుహా

وَأَمَّا السَّائِلَ فَلَا تَنْهَرْ10

యాచకుణ్ణి కసురుకోకు.

Syed Abul Aala Maudoodi