بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

سورة العلق

اقْرَأْ بِاسْمِ رَبِّكَ الَّذِي خَلَقَ1

(ఓ ప్రవక్తా) పఠించు సర్వాన్నీ సృష్టించిన నీ ప్రభువు పేరుతో.

Syed Abul Aala Maudoodi

سورة العلق

خَلَقَ الْإِنسَانَ مِنْ عَلَقٍ2

ఆయన పేరుకుపోయిన నెత్తుటి ముద్దతో మానవుణ్ణి సృజించాడు.

Syed Abul Aala Maudoodi

سورة العلق

اقْرَأْ وَرَبُّكَ الْأَكْرَمُ3

పఠించు: నీ ప్రభువు పరమదయాళువు.

Syed Abul Aala Maudoodi

سورة العلق

الَّذِي عَلَّمَ بِالْقَلَمِ4

ఆయన కలం ద్వారా జ్ఞానం నేర్పాడు,

Syed Abul Aala Maudoodi

سورة العلق

عَلَّمَ الْإِنسَانَ مَا لَمْ يَعْلَمْ5

మనిషి ఎరుగని జ్ఞానాన్ని అతనికి ప్రసాదించాడు.

Syed Abul Aala Maudoodi

سورة العلق

كَلَّا إِنَّ الْإِنسَانَ لَيَطْغَىٰ6

ఎంతమాత్రం కాదు మానవుడు తనను తాను ఎవరి అక్కరలేని వాడననీ,

Syed Abul Aala Maudoodi

سورة العلق

أَن رَّآهُ اسْتَغْنَىٰ7

సర్వస్వతంత్రుడననీ మితిమీరి ప్రవర్తిస్తున్నాడు.

Syed Abul Aala Maudoodi

سورة العلق

إِنَّ إِلَىٰ رَبِّكَ الرُّجْعَىٰ8

(అయితే) చివరికి అందరూ నీ ప్రభువు వైపునకే తప్పనిసరిగా మరలిపోవలసి ఉంటుంది.

Syed Abul Aala Maudoodi

سورة العلق

أَرَأَيْتَ الَّذِي يَنْهَىٰ9

ఒక దాసుడు నమాజు చేస్తుంటే అతన్ని నిరోధించే వ్యక్తిని నీవు చూశావా?

Syed Abul Aala Maudoodi

سورة العلق

عَبْدًا إِذَا صَلَّىٰ10

నమా'జ్‌ చేసే (అల్లాహ్‌) దాసుణ్ణి?

Syed Abul Aala Maudoodi