بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

అల్-బయ్యినహ

لَمْ يَكُنِ الَّذِينَ كَفَرُوا مِنْ أَهْلِ الْكِتَابِ وَالْمُشْرِكِينَ مُنفَكِّينَ حَتَّىٰ تَأْتِيَهُمُ الْبَيِّنَةُ1

గ్రంథ ప్రజలలోని, బహుదైవారాధకులలోని అవిశ్వాసులు తమ వద్దకు స్పష్టమైన ప్రమాణం వచ్చేవరకు (తమ అవిశ్వాస వైఖరి నుండి) వెనక్కి మరలరు.

Syed Abul Aala Maudoodi

అల్-బయ్యినహ

رَسُولٌ مِّنَ اللَّهِ يَتْلُو صُحُفًا مُّطَهَّرَةً2

(స్పష్టమైన ప్రమాణం అంటే) అల్లాహ్ తరఫు నుండి ఒక ప్రవక్త వచ్చి సత్యమైన సవ్యమైన రచనలు గల పరిశుద్ధమైన సహీఫాలను చదివి వినిపించటం.

Syed Abul Aala Maudoodi

అల్-బయ్యినహ

فِيهَا كُتُبٌ قَيِّمَةٌ3

అందులో సమంజసమైన వ్రాతలు (సత్యోపదేశాలు) ఉన్నాయి.

Syed Abul Aala Maudoodi

అల్-బయ్యినహ

وَمَا تَفَرَّقَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ إِلَّا مِن بَعْدِ مَا جَاءَتْهُمُ الْبَيِّنَةُ4

పూర్వం గ్రంథం ఇవ్వబడిన ప్రజలలో చీలికలు ఏర్పడిరది వారి వద్దకు (ఋజుమార్గానికి సంబంధించిన) స్పష్టమైన బోధవచ్చిన తరువాతనే.

Syed Abul Aala Maudoodi

అల్-బయ్యినహ

وَمَا أُمِرُوا إِلَّا لِيَعْبُدُوا اللَّهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ حُنَفَاءَ وَيُقِيمُوا الصَّلَاةَ وَيُؤْتُوا الزَّكَاةَ ۚ وَذَٰلِكَ دِينُ الْقَيِّمَةِ5

వారు అల్లాహ్ కు దాస్యం చెయ్యాలని, పూర్తి ఏకాగ్రతతో తమ ధర్మాన్ని ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని, నమాజ్‌ను స్థాపించాలని, జకాత్‌ ఇస్తూ ఉండాలని మాత్రమే ఆదేశించటం జరిగింది. ఇదే ఎంతో సరిjైున, సవ్యమైన ధర్మం.

Syed Abul Aala Maudoodi

అల్-బయ్యినహ

إِنَّ الَّذِينَ كَفَرُوا مِنْ أَهْلِ الْكِتَابِ وَالْمُشْرِكِينَ فِي نَارِ جَهَنَّمَ خَالِدِينَ فِيهَا ۚ أُولَـٰئِكَ هُمْ شَرُّ الْبَرِيَّةِ6

గ్రంథ ప్రజలలో, బహుదైవారాధకులలో సత్యాన్ని తిరస్కరించినవారు తప్పనిసరిగా నరకాగ్నిలోకే పోతారు, అందులోనే శాశ్వతంగా ఉండిపోతారు. వారు సృష్టిలోకెల్లా పరమ నీచులు.

Syed Abul Aala Maudoodi

అల్-బయ్యినహ

إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ أُولَـٰئِكَ هُمْ خَيْرُ الْبَرِيَّةِ7

కాని విశ్వసించి సత్కార్యాలు చేసేవారు నిస్సందేహంగా సృష్టిలో అత్యంత శ్రేష్ఠులు.

Syed Abul Aala Maudoodi

అల్-బయ్యినహ

جَزَاؤُهُمْ عِندَ رَبِّهِمْ جَنَّاتُ عَدْنٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا ۖ رَّضِيَ اللَّهُ عَنْهُمْ وَرَضُوا عَنْهُ ۚ ذَٰلِكَ لِمَنْ خَشِيَ رَبَّهُ8

వారికి వారి ప్రభువు వద్ద లభించే ప్రతిఫలం - శాశ్వత నివాస స్థలాలైన స్వర్గవనాలు, వాటి క్రింద సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి వారు వాటిలో కలకాలం ఉంటారు. అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడయ్యాడు వారు కూడ అల్లాహ్ పట్ల సంతృప్తిచెందారు. ఇదీ తన ప్రభువు పట్ల భయభక్తులు కలిగి ఉండే వ్యక్తికి లభించే మహాభాగ్యం.

Syed Abul Aala Maudoodi