అల్-ఫాతిహా

بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ1

అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను

Syed Abul Aala Maudoodi

అల్-ఫాతిహా

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ2

అల్లాహ్‌ మాత్రమే స్తుతింపదగినవాడు. ఆయన సకల లోకాలకు ప్రభువు

Syed Abul Aala Maudoodi

అల్-ఫాతిహా

الرَّحْمَـٰنِ الرَّحِيمِ3

అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు

Syed Abul Aala Maudoodi

అల్-ఫాతిహా

مَالِكِ يَوْمِ الدِّينِ4

ప్రతిఫలదినానికి స్వామి

Syed Abul Aala Maudoodi

అల్-ఫాతిహా

إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ5

మేము నిన్నే ఆరాధిస్తాము, సహాయం కొరకు నిన్నే అర్థిస్తాము

Syed Abul Aala Maudoodi

అల్-ఫాతిహా

اهْدِنَا الصِّرَاطَ الْمُسْتَقِيمَ6

మాకు రుజుమార్గం చూపించు

Syed Abul Aala Maudoodi

అల్-ఫాతిహా

صِرَاطَ الَّذِينَ أَنْعَمْتَ عَلَيْهِمْ غَيْرِ الْمَغْضُوبِ عَلَيْهِمْ وَلَا الضَّالِّينَ7

నీవు అనుగ్రహించినవారూ, నీ ఆగ్రహానికి గురికానివారూ, మార్గభ్రష్టులు కానివారూ అనుసరించిన మార్గము

Syed Abul Aala Maudoodi

بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

అల్-బఖరహ్

الم1

అలిఫ్‌ లామ్‌ మీమ్‌

Syed Abul Aala Maudoodi

అల్-బఖరహ్

ذَٰلِكَ الْكِتَابُ لَا رَيْبَ ۛ فِيهِ ۛ هُدًى لِّلْمُتَّقِينَ2

ఇది అల్లాహ్ గ్రంథము. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అల్లాహ్ భీతి కలవారికి ఈ గ్రంథం మార్గదర్శకం

Syed Abul Aala Maudoodi

అల్-బఖరహ్

الَّذِينَ يُؤْمِنُونَ بِالْغَيْبِ وَيُقِيمُونَ الصَّلَاةَ وَمِمَّا رَزَقْنَاهُمْ يُنفِقُونَ3

వారు అగోచర విషయాలను విశ్వసిస్తారు. నమాజును స్థాపిస్తారు. మేము ప్రసాదించిన దానినుండి (మా మార్గంలో) ఖర్చుచేస్తారు.

Syed Abul Aala Maudoodi