అల్-అన్‌ఫాల్

۞ وَاعْلَمُوا أَنَّمَا غَنِمْتُم مِّن شَيْءٍ فَأَنَّ لِلَّهِ خُمُسَهُ وَلِلرَّسُولِ وَلِذِي الْقُرْبَىٰ وَالْيَتَامَىٰ وَالْمَسَاكِينِ وَابْنِ السَّبِيلِ إِن كُنتُمْ آمَنتُم بِاللَّهِ وَمَا أَنزَلْنَا عَلَىٰ عَبْدِنَا يَوْمَ الْفُرْقَانِ يَوْمَ الْتَقَى الْجَمْعَانِ ۗ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ41

మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాలి: మీరు యుద్ధ సంపదగా పొందిన దానిలో ఐదవభాగం అల్లాహ్కూ, ఆయన ప్రవక్తకూ, బంధువులకూ, అనాధలకూ, బీదవారికీ, బాటసారులకూ చెందుతుంది. మీరు అల్లాహ్నూ, నిర్ణయదినం నాడు అంటే ఉభయ సైన్యాలు ఢీకొన్ననాడు మేము మా దాసునిపై అవతరింపజేసిన విషయాన్నీ విశ్వసించినట్లయితే (ఈ భాగాన్ని సంతోషంగా ఇవ్వండి) అల్లాహ్ కు అన్ని విషయాలపై అధికారం ఉంది.

Syed Abul Aala Maudoodi

అల్-అన్‌ఫాల్

إِذْ أَنتُم بِالْعُدْوَةِ الدُّنْيَا وَهُم بِالْعُدْوَةِ الْقُصْوَىٰ وَالرَّكْبُ أَسْفَلَ مِنكُمْ ۚ وَلَوْ تَوَاعَدتُّمْ لَاخْتَلَفْتُمْ فِي الْمِيعَادِ ۙ وَلَـٰكِن لِّيَقْضِيَ اللَّهُ أَمْرًا كَانَ مَفْعُولًا لِّيَهْلِكَ مَنْ هَلَكَ عَن بَيِّنَةٍ وَيَحْيَىٰ مَنْ حَيَّ عَن بَيِّنَةٍ ۗ وَإِنَّ اللَّهَ لَسَمِيعٌ عَلِيمٌ42

ఆ సమయాన్ని గుర్తుకు తెచ్చుకోండి : అప్పుడు మీరు లోయకు ఈ ప్రక్కన ఉన్నారు. వారు ఆ ప్రక్కన మకాము చేశారు. మీకు క్రింది (ఒడ్డు) వైపున బిడారు ఉంది. ఒకవేళ మొదటే మీకూ వారికీ మధ్య యుద్ధం చెయ్యాలి అనే తీర్మానమే జరిగి ఉండినట్లయితే, మీరు తప్పకుండా ఈ సందర్భంలో ఆ తీర్మానాన్ని పాటించకుండా దాటవేసి ఉండేవారు. కాని జరిగింది ఏదో అది అల్లాహ్ తాను తీసుకున్న నిర్ణయాన్ని అమలుపరచటానికి జరిగింది, నశించవలసినవాడు స్పష్టమైన నిదర్శనంతో నశించాలని, జీవించవలసినవాడు స్పష్టమైన నిదర్శనంతో జీవించాలని జరిగింది. నిశ్చయంగా అల్లాహ్ వినేవాడూ తెలిసినవాడూనూ.

Syed Abul Aala Maudoodi

అల్-అన్‌ఫాల్

إِذْ يُرِيكَهُمُ اللَّهُ فِي مَنَامِكَ قَلِيلًا ۖ وَلَوْ أَرَاكَهُمْ كَثِيرًا لَّفَشِلْتُمْ وَلَتَنَازَعْتُمْ فِي الْأَمْرِ وَلَـٰكِنَّ اللَّهَ سَلَّمَ ۗ إِنَّهُ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ43

ఆ సమయాన్ని కూడ గుర్తుకు తెచ్చుకోండి, అప్పుడు ఓ ప్రవక్తా! అల్లాహ్ వారిని నీ కలలో కొద్దిమందిగా చూపాడు. ఒకవేళ ఆయన వారిని ఎక్కువ సంఖ్యలో చూపి ఉన్నట్లయితే, మీరు తప్పకుండా ధైర్యాన్ని కోల్పోయి ఉండేవారు. యుద్ధం విషయంలో వివాదపడి ఉండేవారు. కాని అల్లాహ్ యే మిమ్మల్ని దీనినుండి రక్షించాడు. నిశ్చయంగా ఆయన హృదయాల స్థితిని సైతం ఎరుగును.

Syed Abul Aala Maudoodi

అల్-అన్‌ఫాల్

وَإِذْ يُرِيكُمُوهُمْ إِذِ الْتَقَيْتُمْ فِي أَعْيُنِكُمْ قَلِيلًا وَيُقَلِّلُكُمْ فِي أَعْيُنِهِمْ لِيَقْضِيَ اللَّهُ أَمْرًا كَانَ مَفْعُولًا ۗ وَإِلَى اللَّهِ تُرْجَعُ الْأُمُورُ44

జ్ఞాపకం తెచ్చుకోండి: యుద్ధ సమయంలో అల్లాహ్ మీ దృష్టికి శత్రువులను కొద్దిమందిగా చూపాడు. వారి దృష్టికి మిమ్మల్ని తగ్గించి చూపాడు, జరుగవలసి ఉన్నదానిని అల్లాహ్ అమలులోకి తీసుకురావడానికి. చివరకు అన్ని వ్యవహారాలూ అల్లాహ్ వద్దకే మరలిపోతాయి.

Syed Abul Aala Maudoodi

అల్-అన్‌ఫాల్

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا لَقِيتُمْ فِئَةً فَاثْبُتُوا وَاذْكُرُوا اللَّهَ كَثِيرًا لَّعَلَّكُمْ تُفْلِحُونَ45

విశ్వాసులారా! మీరు ఒక వర్గాన్ని ఎదుర్కొన్నప్పుడు స్థైర్యముతో ఉండండి. అల్లాహ్ ను అత్యధికంగా స్మరించండి, మీకు విజయభాగ్యం కలుగుతుందని ఆశించవచ్చు.

Syed Abul Aala Maudoodi

అల్-అన్‌ఫాల్

وَأَطِيعُوا اللَّهَ وَرَسُولَهُ وَلَا تَنَازَعُوا فَتَفْشَلُوا وَتَذْهَبَ رِيحُكُمْ ۖ وَاصْبِرُوا ۚ إِنَّ اللَّهَ مَعَ الصَّابِرِينَ46

అల్లాహ్కూ ఆయన ప్రవక్తకూ విధేయత చూపండి. పరస్పరం కలహించుకోకండి. అలా జరిగితే మీలో బలహీనత ప్రవేశిస్తుంది, మీ శక్తి సన్నగిల్లిపోతుంది. సహనంతో మెలగండి. నిశ్చయంగా అల్లాహ్ సహనం చూపేవారితో ఉంటాడు.

Syed Abul Aala Maudoodi

అల్-అన్‌ఫాల్

وَلَا تَكُونُوا كَالَّذِينَ خَرَجُوا مِن دِيَارِهِم بَطَرًا وَرِئَاءَ النَّاسِ وَيَصُدُّونَ عَن سَبِيلِ اللَّهِ ۚ وَاللَّهُ بِمَا يَعْمَلُونَ مُحِيطٌ47

తమ గృహాల నుండి విర్రవీగుతూ ప్రజల ముందు తమ దర్పాన్ని ప్రదర్శిస్తూ బయలుదేరేవారి మాదిరిగా, అల్లాహ్ మార్గం నుండి ప్రజలను నిరోధించే వైఖరిని కలిగి వున్నవారి మాదిరిగా ప్రవర్తించకండి. వారు చేస్తున్నది ఏదీ అల్లాహ్ పట్టుకు అతీతంగా లేదు.

Syed Abul Aala Maudoodi

అల్-అన్‌ఫాల్

وَإِذْ زَيَّنَ لَهُمُ الشَّيْطَانُ أَعْمَالَهُمْ وَقَالَ لَا غَالِبَ لَكُمُ الْيَوْمَ مِنَ النَّاسِ وَإِنِّي جَارٌ لَّكُمْ ۖ فَلَمَّا تَرَاءَتِ الْفِئَتَانِ نَكَصَ عَلَىٰ عَقِبَيْهِ وَقَالَ إِنِّي بَرِيءٌ مِّنكُمْ إِنِّي أَرَىٰ مَا لَا تَرَوْنَ إِنِّي أَخَافُ اللَّهَ ۚ وَاللَّهُ شَدِيدُ الْعِقَابِ48

ఆ సమయాన్ని గురించి కొంచెం ఆలోచించండి అప్పుడు షైతాను వారి చేష్టలను వారి దృష్టికి ఆకర్షకములుగా చేసిచూపాడు. ఇంకా వారితో ఇలా అన్నాడు : ‘‘ఈనాడు మిమ్మల్ని ఎవడూ జయించలేడు, (ఎందుకంటే) నేను మీతో ఉన్నాను.’’ కాని రెండు పక్షాలు ఒక దానికొకటి ఎదురుపడినప్పుడు, అతడు మడమతిప్పి ఇలా అన్నాడు: ‘‘మీకూ నాకూ ఏ సంబంధమూ లేదు. మీరు చూడనివి ఎన్నో నేను చూస్తున్నాను. నాకు అల్లాహ్ అంటే భయం కలుగుతోంది. అల్లాహ్ కఠినంగా శిక్షించేవాడు.’’

Syed Abul Aala Maudoodi

అల్-అన్‌ఫాల్

إِذْ يَقُولُ الْمُنَافِقُونَ وَالَّذِينَ فِي قُلُوبِهِم مَّرَضٌ غَرَّ هَـٰؤُلَاءِ دِينُهُمْ ۗ وَمَن يَتَوَكَّلْ عَلَى اللَّهِ فَإِنَّ اللَّهَ عَزِيزٌ حَكِيمٌ49

అప్పుడు కపటులూ, హృదయాలకు రోగం తగిలినవారూ, అందరూ ఇలా అన్నారు: ‘‘వారిని వారి ధర్మం పిచ్చివారిని చేసింది.’’ వాస్తవానికి ఎవరైనా అల్లాహ్ ను నమ్ముకుంటే, నిశ్చయంగా అల్లాహ్ మహాశక్తిమంతుడూ, మహా వివేకవంతుడూను.

Syed Abul Aala Maudoodi

అల్-అన్‌ఫాల్

وَلَوْ تَرَىٰ إِذْ يَتَوَفَّى الَّذِينَ كَفَرُوا ۙ الْمَلَائِكَةُ يَضْرِبُونَ وُجُوهَهُمْ وَأَدْبَارَهُمْ وَذُوقُوا عَذَابَ الْحَرِيقِ50

దైవదూతలు, హతులైన అవిశ్వాసుల ప్రాణాలను తీస్తున్నప్పటి స్థితిని నీవు గనక చూడగలిగితే ఎంత బాగుండేది! వారు వారి ముఖాలపైని, పిరుదులపైని కొట్టేవారు. ఇంకా ఇలా అనేవారు : ‘‘ఇదో, కాల్చే శిక్షను అనుభవించండి.

Syed Abul Aala Maudoodi