అత్-తౌబా

۞ إِنَّمَا السَّبِيلُ عَلَى الَّذِينَ يَسْتَأْذِنُونَكَ وَهُمْ أَغْنِيَاءُ ۚ رَضُوا بِأَن يَكُونُوا مَعَ الْخَوَالِفِ وَطَبَعَ اللَّهُ عَلَىٰ قُلُوبِهِمْ فَهُمْ لَا يَعْلَمُونَ93

అయితే ధనవంతుల పట్ల ఆక్షేపణ ఉంది. ఎందుకంటే తమను పోరాటంలో పాల్గొనే విషయంలో మన్నించవలసిందిగా నీకు విజ్ఞప్తి చేశారు. వారు ఇంటివద్ద కూర్చుండిపోయే స్త్రీలలో చేరిపోవటానికి ఇష్టపడ్డారు. అల్లాహ్ వారి హృదయాలపై ముద్రవేశాడు. ఇందువల్ల వారికి ఏమీ తెలియదు. (అల్లాహ్ వద్ద వారి ఈ వైఖరికి ఏ ఫలితం కలుగనున్నదో అనేది).

Syed Abul Aala Maudoodi

అత్-తౌబా

يَعْتَذِرُونَ إِلَيْكُمْ إِذَا رَجَعْتُمْ إِلَيْهِمْ ۚ قُل لَّا تَعْتَذِرُوا لَن نُّؤْمِنَ لَكُمْ قَدْ نَبَّأَنَا اللَّهُ مِنْ أَخْبَارِكُمْ ۚ وَسَيَرَى اللَّهُ عَمَلَكُمْ وَرَسُولُهُ ثُمَّ تُرَدُّونَ إِلَىٰ عَالِمِ الْغَيْبِ وَالشَّهَادَةِ فَيُنَبِّئُكُم بِمَا كُنتُمْ تَعْمَلُونَ94

మీరు తిరిగి వారివద్దకు పోయినప్పుడు, వారు రకరకాల సాకులు చెబుతారు. కాని మీరు స్పష్టంగా ఇలా చెప్పండి : ‘‘సాకులు చెప్పకండి. మేము మీ ఏ మాటనూ నమ్మం. అల్లాహ్ మాకు మీ పరిస్థితులన్నీ తెలిపాడు. ఇక అల్లాహ్ ఆయన ప్రవక్తా మీ ప్రవర్తనను చూస్తారు. తరువాత మీరు ఆయన వైపునకు మరలింపబడతారు. ఆయన బహిరంగంగా ఉన్నదీ గుప్తంగా ఉన్నదీ, అంతా ఎరిగినవాడు. మీరు ఏమేమి చేస్తూ ఉండేవారో ఆయన మీకు తెలుపుతాడు.’’

Syed Abul Aala Maudoodi

అత్-తౌబా

سَيَحْلِفُونَ بِاللَّهِ لَكُمْ إِذَا انقَلَبْتُمْ إِلَيْهِمْ لِتُعْرِضُوا عَنْهُمْ ۖ فَأَعْرِضُوا عَنْهُمْ ۖ إِنَّهُمْ رِجْسٌ ۖ وَمَأْوَاهُمْ جَهَنَّمُ جَزَاءً بِمَا كَانُوا يَكْسِبُونَ95

నీవు మరలివచ్చిన తరువాత వారు నీ ముందు ప్రమాణాలు చేస్తారు, నీవు వారిని ఉపేక్షించాలని. కనుక నీవు వారిని తప్పకుండా ఉపేక్షించు. ఎందుకంటే, వారొక మాలిన్యం వంటివారు. వారి అసలు స్థానం నరకం. అది వారి సంపాదనకు ప్రతిఫలంగా వారికి లభిస్తుంది.

Syed Abul Aala Maudoodi

అత్-తౌబా

يَحْلِفُونَ لَكُمْ لِتَرْضَوْا عَنْهُمْ ۖ فَإِن تَرْضَوْا عَنْهُمْ فَإِنَّ اللَّهَ لَا يَرْضَىٰ عَنِ الْقَوْمِ الْفَاسِقِينَ96

వారు నీ సమక్షంలో ప్రమాణాలు చేస్తారు, వారికి నీవు ప్రసన్నుడవు కావాలని. వాస్తవానికి, ఒకవేళ నీవు వారిపట్ల ప్రసన్నత చూపినా అల్లాహ్ మటుకు అటువంటి విద్రోహులకు ఎన్నటికీ ప్రసన్నుడు కాడు.

Syed Abul Aala Maudoodi

అత్-తౌబా

الْأَعْرَابُ أَشَدُّ كُفْرًا وَنِفَاقًا وَأَجْدَرُ أَلَّا يَعْلَمُوا حُدُودَ مَا أَنزَلَ اللَّهُ عَلَىٰ رَسُولِهِ ۗ وَاللَّهُ عَلِيمٌ حَكِيمٌ97

ఈ ఎడారి అరబ్బులు అవిశ్వాసం విషయంలో, కాపట్యం విషయంలో బహుమూర్ఖులు. కనుక అల్లాహ్ తన ప్రవక్తపై అవతరింపజేసిన ధర్మం యొక్క హద్దులు వారికి తెలియకుండా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అల్లాహ్ కు అన్నీ తెలుసు. ఆయన జ్ఞానీ, వివేకవంతుడూను.

Syed Abul Aala Maudoodi

అత్-తౌబా

وَمِنَ الْأَعْرَابِ مَن يَتَّخِذُ مَا يُنفِقُ مَغْرَمًا وَيَتَرَبَّصُ بِكُمُ الدَّوَائِرَ ۚ عَلَيْهِمْ دَائِرَةُ السَّوْءِ ۗ وَاللَّهُ سَمِيعٌ عَلِيمٌ98

దేవుని మార్గంలో ఖర్చుపెడుతున్నప్పుడు అది బలవంతంగా తమపై రుద్దబడిరదని భావించేవారు ఈ ఎడారి అరబ్బులలో కొందరు ఉన్నారు. మీ విషయంలో వారు కాలం మార్పుల కోసం నిరీక్షిస్తున్నారు, (మీరు ఏదైనా సంకటంలో చిక్కుకుంటే మీరు వారిని బంధించి ఉంచిన ఈ వ్యవస్థ యొక్క విధేయతా శృంఖలాలను త్రెంచిపారేయాలని) వాస్తవానికి సంకట వలయం స్వయంగా వారినే చుట్టుముట్టి ఉంది. అల్లాహ్ అంతా వింటాడు. ఆయనకు అన్నీ తెలుసు.

Syed Abul Aala Maudoodi

అత్-తౌబా

وَمِنَ الْأَعْرَابِ مَن يُؤْمِنُ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَيَتَّخِذُ مَا يُنفِقُ قُرُبَاتٍ عِندَ اللَّهِ وَصَلَوَاتِ الرَّسُولِ ۚ أَلَا إِنَّهَا قُرْبَةٌ لَّهُمْ ۚ سَيُدْخِلُهُمُ اللَّهُ فِي رَحْمَتِهِ ۗ إِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ99

ఈ ఎడారి అరబ్బులలోనే ఇంకా కొంతమంది ఉన్నారు. వారు అల్లాహ్నూ అంతిమదినాన్నీ విశ్వసిస్తారు. తాము ఖర్చుచేసే దానిని అల్లాహ్ సాన్నిహిత్యం పొందటానికీ ప్రవక్తనుండి దేవుని కారుణ్యానికై ప్రార్థనలు పొందటానికీ సాధనంగా చేసుకుంటారు. అవును! అది నిశ్చయంగా అల్లాహ్ సాన్నిహిత్యాన్ని పొందటానికి సాధనమే. అల్లాహ్ తప్పకుండా వారిని తన కారుణ్యంలో ప్రవేశింపజేస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ క్షమించేవాడూ కరుణించేవాడూను.

Syed Abul Aala Maudoodi

అత్-తౌబా

وَالسَّابِقُونَ الْأَوَّلُونَ مِنَ الْمُهَاجِرِينَ وَالْأَنصَارِ وَالَّذِينَ اتَّبَعُوهُم بِإِحْسَانٍ رَّضِيَ اللَّهُ عَنْهُمْ وَرَضُوا عَنْهُ وَأَعَدَّ لَهُمْ جَنَّاتٍ تَجْرِي تَحْتَهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا ۚ ذَٰلِكَ الْفَوْزُ الْعَظِيمُ100

అందరికంటే ముందు విశ్వాస సందేశాన్ని స్వీకరించటానికి ముందంజవేసిన ముహాజిరుల (వలస వచ్చినవారి) పట్లా అన్సారుల (ఆశ్రయమిచ్చినవారి) పట్లా తరువాత నిజాయితీతో వారి వెనుక వచ్చినవారిపట్లా అల్లాహ్ తృప్తి చెందాడు. వారు కూడా అల్లాహ్ పట్ల తృప్తి చెందారు. అల్లాహ్ వారి కొరకు క్రింద సెలయేళ్ళు ప్రవహించే ఉద్యానవనాలను సిద్ధపరచి ఉంచాడు. వారు వాటిలో సదా ఉంటారు. ఇదే మహత్తరమైన సాఫల్యం.

Syed Abul Aala Maudoodi

అత్-తౌబా

وَمِمَّنْ حَوْلَكُم مِّنَ الْأَعْرَابِ مُنَافِقُونَ ۖ وَمِنْ أَهْلِ الْمَدِينَةِ ۖ مَرَدُوا عَلَى النِّفَاقِ لَا تَعْلَمُهُمْ ۖ نَحْنُ نَعْلَمُهُمْ ۚ سَنُعَذِّبُهُم مَّرَّتَيْنِ ثُمَّ يُرَدُّونَ إِلَىٰ عَذَابٍ عَظِيمٍ101

మీ చుట్టుపక్కల ఉండే ఎడారి అరబ్బులలో కపటులు చాలామంది ఉన్నారు. అలాగే స్వయంగా మదీనా పౌరులలో కూడా కపటులు ఉన్నారు. వారు కాపట్యంలో రాటుదేలారు. మీరు వారిని ఎరుగరు. మేము వారిని ఎరుగుదుము. మేము వారికి రెట్టింపు శిక్షను విధించే సమయం సమీపంలోనే ఉంది. తరువాత వారు మరింత పెద్ద శిక్ష కొరకు తిరిగి తీసుకురాబడతారు.

Syed Abul Aala Maudoodi

అత్-తౌబా

وَآخَرُونَ اعْتَرَفُوا بِذُنُوبِهِمْ خَلَطُوا عَمَلًا صَالِحًا وَآخَرَ سَيِّئًا عَسَى اللَّهُ أَن يَتُوبَ عَلَيْهِمْ ۚ إِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ102

తమ తప్పులను ఒప్పుకున్నవారు కొందరు ఉన్నారు. వారి ఆచరణ మిశ్రమమైనది. కొంత మంచీ, కొంత చెడూ. అల్లాహ్ వారిని మళ్ళీ కరుణించటం అనేది అసంభవమేమీ కాదు. ఎందుకంటే, ఆయన మన్నించేవాడూ కరుణించేవాడూను.

Syed Abul Aala Maudoodi