۞ وَمَا مِن دَابَّةٍ فِي الْأَرْضِ إِلَّا عَلَى اللَّهِ رِزْقُهَا وَيَعْلَمُ مُسْتَقَرَّهَا وَمُسْتَوْدَعَهَا ۚ كُلٌّ فِي كِتَابٍ مُّبِينٍ6
ధరణిపై సంచరించే ఏ ప్రాణి ఉపాధి అయినా అల్లాహ్ బాధ్యతలో లేకుండా లేదు. ఆ ప్రాణి ఎక్కడ నివసిస్తుందో అది ఎక్కడకు చేర్చబడనున్నదో ఆయనకు తెలియకుండా లేవు. సమస్తమూ ఒక స్పష్టమైన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది.
Syed Abul Aala Maudoodi
وَهُوَ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ وَكَانَ عَرْشُهُ عَلَى الْمَاءِ لِيَبْلُوَكُمْ أَيُّكُمْ أَحْسَنُ عَمَلًا ۗ وَلَئِن قُلْتَ إِنَّكُم مَّبْعُوثُونَ مِن بَعْدِ الْمَوْتِ لَيَقُولَنَّ الَّذِينَ كَفَرُوا إِنْ هَـٰذَا إِلَّا سِحْرٌ مُّبِينٌ7
ఆకాశాలనూ, భూమినీ ఆరు దినాలలో సృష్టించినవాడు ఆయనే - దానికి పూర్వం ఆయన సింహాసనం నీళ్ళపై ఉండేది - మీలో ఎవడు మంచిపనులు చేస్తాడో మిమ్మల్ని పరీక్షించి చూద్దామని. ప్రవక్తా! ఇప్పుడు నీవు గనక వారితో ‘‘ప్రజలారా! మరణించిన తరువాత మీరు మళ్ళీ లేపబడతారు’’ అని అంటే అవిశ్వాసులు తక్షణం ఇలా అంటారు : ‘‘ఇది స్పష్టమైన ఇంద్రజాలం’’.
Syed Abul Aala Maudoodi
وَلَئِنْ أَخَّرْنَا عَنْهُمُ الْعَذَابَ إِلَىٰ أُمَّةٍ مَّعْدُودَةٍ لَّيَقُولُنَّ مَا يَحْبِسُهُ ۗ أَلَا يَوْمَ يَأْتِيهِمْ لَيْسَ مَصْرُوفًا عَنْهُمْ وَحَاقَ بِهِم مَّا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ8
ఒకవేళ మేము వారి శిక్షను ఒక నిర్ణీత వ్యవధి వరకు వాయిదా వేస్తే వారు, అసలు దానిని ఏ వస్తువు పట్టి ఆపుతోంది? అని అనటం ప్రారంభిస్తారు. వినండి, ఆ శిక్షా సమయం వచ్చే రోజున దానిని ఎవరూ మరలించలేరు. వారు ఎగతాళి చేస్తూ ఉన్నదే వారిని చుట్టుముట్టుతుంది.
Syed Abul Aala Maudoodi
وَلَئِنْ أَذَقْنَا الْإِنسَانَ مِنَّا رَحْمَةً ثُمَّ نَزَعْنَاهَا مِنْهُ إِنَّهُ لَيَئُوسٌ كَفُورٌ9
ఒకవేళ మేము ఎప్పుడైనా మానవునికి మా కారుణ్యాన్ని ప్రసాదించి, తరువాత అది అతనికి లేకుండా చేస్తే అతడు నిరాశ చెందుతాడు. కృతఘ్నత చూపుతాడు.
Syed Abul Aala Maudoodi
وَلَئِنْ أَذَقْنَاهُ نَعْمَاءَ بَعْدَ ضَرَّاءَ مَسَّتْهُ لَيَقُولَنَّ ذَهَبَ السَّيِّئَاتُ عَنِّي ۚ إِنَّهُ لَفَرِحٌ فَخُورٌ10
అతనిపై పడిన ఆపద (తొలగిన) తరువాత, ఒకవేళ మేము అతనికి అనుగ్రహాన్ని రుచి చూపిస్తే, ‘‘కష్టాలన్నీ తొలగి పోయాయి’’ అని అంటాడు. అతడు తరువాత ఉబ్బితబ్బిబ్బౌతాడు, విర్రవీగుతాడు.
Syed Abul Aala Maudoodi
إِلَّا الَّذِينَ صَبَرُوا وَعَمِلُوا الصَّالِحَاتِ أُولَـٰئِكَ لَهُم مَّغْفِرَةٌ وَأَجْرٌ كَبِيرٌ11
సహనశీలురూ, సత్కార్యపరులూ అయినవారు మాత్రమే ఈ దోషానికి అతీతులు. వారికే మన్నింపూ, పెద్ద బహుమానమూను.
Syed Abul Aala Maudoodi
فَلَعَلَّكَ تَارِكٌ بَعْضَ مَا يُوحَىٰ إِلَيْكَ وَضَائِقٌ بِهِ صَدْرُكَ أَن يَقُولُوا لَوْلَا أُنزِلَ عَلَيْهِ كَنزٌ أَوْ جَاءَ مَعَهُ مَلَكٌ ۚ إِنَّمَا أَنتَ نَذِيرٌ ۚ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ وَكِيلٌ12
ప్రవక్తా! వహీ ద్వారా నీకు తెలుపబడుతూవున్న విషయాలలో దేనినైనా (ప్రకటించకుండా) వదలిపెట్టబోకుము సుమా! వారు ‘‘ఈ వ్యక్తిపై ఏదైనా నిధి ఎందుకు దింపబడలేదు?’’ లేదా ‘‘ఇతనితో పాటు దైవదూత ఎవడైనా ఎందుకు రాలేదు?’’ అని అంటారని నీ మనస్సు బాధ పడకూడదు. నీవు కేవలం హెచ్చరిక చేసేవాడవు. ఆపై అన్నింటికీ అల్లాహ్ యే బాధ్యుడు.
Syed Abul Aala Maudoodi
أَمْ يَقُولُونَ افْتَرَاهُ ۖ قُلْ فَأْتُوا بِعَشْرِ سُوَرٍ مِّثْلِهِ مُفْتَرَيَاتٍ وَادْعُوا مَنِ اسْتَطَعْتُم مِّن دُونِ اللَّهِ إِن كُنتُمْ صَادِقِينَ13
ప్రవక్తయే స్వయంగా ఈ గ్రంథాన్ని కల్పించాడని వారు అంటున్నారా? ఇలా అను : ‘‘సరే విషయం గనక ఇదే అయితే ఇటువంటి కల్పించబడిన పది సూరాలను మీరు రచించి తీసుకురండి. అల్లాహ్ ను తప్ప, (మీ ఆరాధ్య దైవాలలో) ఎవరినైనా సరే సహాయం కొరకు పిలువ గలిగితే పిలుచుకొండి, మీరేగనక (వారిని ఆరాధ్య దైవాలుగా భావించటంలో) సత్యవంతులే అయితే.
Syed Abul Aala Maudoodi
فَإِلَّمْ يَسْتَجِيبُوا لَكُمْ فَاعْلَمُوا أَنَّمَا أُنزِلَ بِعِلْمِ اللَّهِ وَأَن لَّا إِلَـٰهَ إِلَّا هُوَ ۖ فَهَلْ أَنتُم مُّسْلِمُونَ14
ఇప్పుడు ఒకవేళ వారు (మీ ఆరాధ్యదైవాలు) మీ సహాయం కొరకు రాలేకపోతే, తెలుసుకోండి, ఈ గ్రంథం అల్లాహ్ ఎరుకతోనే అవతరించిందని, అల్లాహ్ తప్ప నిజమైన దేవుడు మరొకడు లేడని. ఇప్పుడైనా మీరు (ఈ సత్యవిషయాన్ని) శిరసావహిస్తారా?’’
Syed Abul Aala Maudoodi
مَن كَانَ يُرِيدُ الْحَيَاةَ الدُّنْيَا وَزِينَتَهَا نُوَفِّ إِلَيْهِمْ أَعْمَالَهُمْ فِيهَا وَهُمْ فِيهَا لَا يُبْخَسُونَ15
కేవలం ఈ ప్రాపంచిక జీవితాన్నీ, దాని ఆకర్షకాలనూ కోరుకునే వారు చేసిన పనులకు పూర్తి ప్రతిఫలాన్ని మేము వారికి ఇక్కడనే ఇచ్చేస్తాము. ఇందులో వారికి తక్కువచెయ్యటం అంటూ జరుగదు.
Syed Abul Aala Maudoodi