యూసుఫ్

۞ وَمَا أُبَرِّئُ نَفْسِي ۚ إِنَّ النَّفْسَ لَأَمَّارَةٌ بِالسُّوءِ إِلَّا مَا رَحِمَ رَبِّي ۚ إِنَّ رَبِّي غَفُورٌ رَّحِيمٌ53

నేను నా మనస్సు నిర్దోషిత్వాన్ని చాటుకోవటం లేదు. మనస్సు చెడుకై ప్రేరేపిస్తూనే ఉంటుంది, నా ప్రభువు కరుణించినవారిని తప్ప. నిస్సందేహంగా నా ప్రభువు క్షమించేవాడూ, కరుణించేవాడూను.

Syed Abul Aala Maudoodi

యూసుఫ్

وَقَالَ الْمَلِكُ ائْتُونِي بِهِ أَسْتَخْلِصْهُ لِنَفْسِي ۖ فَلَمَّا كَلَّمَهُ قَالَ إِنَّكَ الْيَوْمَ لَدَيْنَا مَكِينٌ أَمِينٌ54

రాజు ఇలా అన్నాడు: అతనిని నా వద్దకు తీసుకురండి. నేను అతనిని ప్రత్యేకంగా నా కోసం వినియోగించుకుంటాను.యూసుఫ్‌ అతనితో మాట్లాడినప్పుడు తను ఇలా అన్నాడు : ‘‘ఇప్పుడు మీకు మా వద్ద గౌరవప్రదమైన స్థానం ఉన్నది. మీరు విశ్వసనీయులు. మాకు మీపై పూర్తి నమ్మకం ఉంది.’’

Syed Abul Aala Maudoodi

యూసుఫ్

قَالَ اجْعَلْنِي عَلَىٰ خَزَائِنِ الْأَرْضِ ۖ إِنِّي حَفِيظٌ عَلِيمٌ55

యూసుఫ్‌ ఇలా అన్నాడు : ‘‘దేశంలోని ఖజానాలను నాకు అప్పగించండి. వాటిని నేను రక్షించగలను. అందుకు తగిన జ్ఞానం నాకు ఉన్నది.’’

Syed Abul Aala Maudoodi

యూసుఫ్

وَكَذَٰلِكَ مَكَّنَّا لِيُوسُفَ فِي الْأَرْضِ يَتَبَوَّأُ مِنْهَا حَيْثُ يَشَاءُ ۚ نُصِيبُ بِرَحْمَتِنَا مَن نَّشَاءُ ۖ وَلَا نُضِيعُ أَجْرَ الْمُحْسِنِينَ56

ఇలా మేము ఆ భూభాగంపై యూసుఫ్‌ కొరకు అధికార మార్గాన్ని సుగమం చేశాము. ఆ భూభాగంపై తాను కోరినచోట తన స్థానాన్ని ఏర్పాటు చేసుకునే హక్కు అతనికి ఉన్నది. మాకు ఇష్టమైనవారికి మా కారుణ్యభాగ్యాన్ని మేము కలుగజేస్తాము. సజ్జనుల ప్రతిఫలం మా వద్ద వృధా కాదు.

Syed Abul Aala Maudoodi

యూసుఫ్

وَلَأَجْرُ الْآخِرَةِ خَيْرٌ لِّلَّذِينَ آمَنُوا وَكَانُوا يَتَّقُونَ57

విశ్వసించి భయభక్తులతో వ్యవహరించే వారికి పరలోక ప్రతిఫలమే ఎక్కువ ఉత్తమమైనది.

Syed Abul Aala Maudoodi

యూసుఫ్

وَجَاءَ إِخْوَةُ يُوسُفَ فَدَخَلُوا عَلَيْهِ فَعَرَفَهُمْ وَهُمْ لَهُ مُنكِرُونَ58

యూసుఫ్‌ సోదరులు ఈజిప్టుకు వచ్చారు. అతని ముందు హాజరయ్యారు. అతను వారిని గుర్తుపట్టాడు. కాని వారు అతనిని గుర్తుపట్టలేదు.

Syed Abul Aala Maudoodi

యూసుఫ్

وَلَمَّا جَهَّزَهُم بِجَهَازِهِمْ قَالَ ائْتُونِي بِأَخٍ لَّكُم مِّنْ أَبِيكُمْ ۚ أَلَا تَرَوْنَ أَنِّي أُوفِي الْكَيْلَ وَأَنَا خَيْرُ الْمُنزِلِينَ59

వారు బయలుదేరుతుండగా వారితో ఇలా అన్నాడు: ‘‘మీ మారు సోదరుణ్ణి నా వద్దకు తీసుకురండి. నేను ఎలా కొలపాత్రను నింపి ఇస్తున్నానో, ఎంత చక్కగా అతిథులను సత్కరిస్తున్నానో మీరు చూడటం లేదా!

Syed Abul Aala Maudoodi

యూసుఫ్

فَإِن لَّمْ تَأْتُونِي بِهِ فَلَا كَيْلَ لَكُمْ عِندِي وَلَا تَقْرَبُونِ60

మీరు గనక అతనిని తీసుకురాకపోతే, మీకు నా వద్ద ధాన్యం లభించదు. మీరు నా దరిదాపులకు కూడా రావద్దు.

Syed Abul Aala Maudoodi

యూసుఫ్

قَالُوا سَنُرَاوِدُ عَنْهُ أَبَاهُ وَإِنَّا لَفَاعِلُونَ61

వారు ఇలా అన్నారు : ‘‘తండ్రిగారు అతనిని పంపటానికి సమ్మతించేలా మేము ప్రయత్నం చేస్తాము. మేము అలా తప్పకుండా చేస్తాము.’’

Syed Abul Aala Maudoodi

యూసుఫ్

وَقَالَ لِفِتْيَانِهِ اجْعَلُوا بِضَاعَتَهُمْ فِي رِحَالِهِمْ لَعَلَّهُمْ يَعْرِفُونَهَا إِذَا انقَلَبُوا إِلَىٰ أَهْلِهِمْ لَعَلَّهُمْ يَرْجِعُونَ62

యూసుఫ్‌ తన నౌకర్లకు సంజ్ఞ చేశాడు : ‘‘వారు ధాన్యానికి బదులుగా ఇచ్చిన సొమ్మును మెల్లగా వాళ్ళ సామానులోనే పెట్టెయ్యండి.’’ వారు ఇంటికి చేరి, తిరిగి పొందిన తమ సొమ్మును గుర్తిస్తారనీ, (లేక ఈ దాతృత్వానికి కృతజ్ఞులౌతారనీ) వారు తిరిగివచ్చినా ఆశ్చర్యం లేదనీ ఆశించి యూసుఫ్‌ ఇలా చేశాడు.

Syed Abul Aala Maudoodi