అల్-కహ్ఫ్

۞ قَالَ أَلَمْ أَقُل لَّكَ إِنَّكَ لَن تَسْتَطِيعَ مَعِيَ صَبْرًا75

అతను ఇలా అన్నాడు, ‘‘మీరు నాతో సహనంగా ఉండలేరని నేను మీకు చెప్పలేదా!’’

Syed Abul Aala Maudoodi

అల్-కహ్ఫ్

قَالَ إِن سَأَلْتُكَ عَن شَيْءٍ بَعْدَهَا فَلَا تُصَاحِبْنِي ۖ قَدْ بَلَغْتَ مِن لَّدُنِّي عُذْرًا76

మూసా ఇలా పలికాడు, ‘‘దీని తరువాత ఒకవేళ నేను మిమ్మల్ని ఏదైనా అడిగితే, మీరు నన్ను మీ వెంట ఉండనీయకండి. ఇదిగో, ఇప్పుడు మీకు నా వైపు నుండి సాకు దొరికిపోయింది.’’

Syed Abul Aala Maudoodi

అల్-కహ్ఫ్

فَانطَلَقَا حَتَّىٰ إِذَا أَتَيَا أَهْلَ قَرْيَةٍ اسْتَطْعَمَا أَهْلَهَا فَأَبَوْا أَن يُضَيِّفُوهُمَا فَوَجَدَا فِيهَا جِدَارًا يُرِيدُ أَن يَنقَضَّ فَأَقَامَهُ ۖ قَالَ لَوْ شِئْتَ لَاتَّخَذْتَ عَلَيْهِ أَجْرًا77

తరువాత వారు ముందుకు సాగిపోయారు. చివరకు ఒక పట్టణానికి చేరుకున్నారు. అక్కడి ప్రజలను అన్నం పెట్టమని అభ్యర్థించారు. కాని వారు వీరిద్దరికీ ఆతిథ్యమీయటానికి తిరస్కరించారు. అక్కడ వారు కూలిపోనున్న ఒక గోడను చూశారు. ఆ వ్యక్తి ఆ గోడను మళ్ళీ నిలబెట్టాడు. మూసా ఇలా అన్నాడు, ‘‘మీకు ఇష్టమైతే ఈ శ్రమకు ప్రతిఫలం తీసుకునేవారు.’’

Syed Abul Aala Maudoodi

అల్-కహ్ఫ్

قَالَ هَـٰذَا فِرَاقُ بَيْنِي وَبَيْنِكَ ۚ سَأُنَبِّئُكَ بِتَأْوِيلِ مَا لَمْ تَسْتَطِع عَّلَيْهِ صَبْرًا78

ఆయన ఇలా అన్నారు, ‘‘ఇక చాలు మన సహవాసం ముగిసింది. ఇక మీరు సహనం చూపలేకపోయిన ఆ విషయాల తత్వాన్ని నేను మీకు వివరిస్తాను.

Syed Abul Aala Maudoodi

అల్-కహ్ఫ్

أَمَّا السَّفِينَةُ فَكَانَتْ لِمَسَاكِينَ يَعْمَلُونَ فِي الْبَحْرِ فَأَرَدتُّ أَنْ أَعِيبَهَا وَكَانَ وَرَاءَهُم مَّلِكٌ يَأْخُذُ كُلَّ سَفِينَةٍ غَصْبًا79

ఆ పడవ వృత్తాంతం ఏమిటంటే, అది నదిలో కష్టపడి పని చేసుకునే కొందరు నిరు పేదలది. నేను దానికి లోపం కల్పించాలని ఎందుకు అనుకొన్నానంటే ప్రతి పడవను బలవంతంగా వశపరచుకొనే ఒక రాజుకు చెందిన ప్రాంతం ముందు రాబోతోంది.

Syed Abul Aala Maudoodi

అల్-కహ్ఫ్

وَأَمَّا الْغُلَامُ فَكَانَ أَبَوَاهُ مُؤْمِنَيْنِ فَخَشِينَا أَن يُرْهِقَهُمَا طُغْيَانًا وَكُفْرًا80

ఇక ఆ బాలుని విషయం - అతని తల్లిదండ్రులు విశ్వాసులు. అతడు తన తలబిరుసుతనం వల్లా, తన అవిశ్వాసం వల్లా, వారిని వేధిస్తాడనే భయం మాకు కలిగింది.

Syed Abul Aala Maudoodi

అల్-కహ్ఫ్

فَأَرَدْنَا أَن يُبْدِلَهُمَا رَبُّهُمَا خَيْرًا مِّنْهُ زَكَاةً وَأَقْرَبَ رُحْمًا81

ఈ కారణం వల్ల మేము కోరుకున్న దేమిటంటే, వారి ప్రభువు అతనికి మారుగా, నడవడికలో అతనికంటే మంచివాడునూ, రక్త సంబంధీకులను ఎక్కువగా కనికరిస్తాడని ఆశించదగిన వాడునూ అయిన మరొక బిడ్డను వారికి ఇవ్వాలని.

Syed Abul Aala Maudoodi

అల్-కహ్ఫ్

وَأَمَّا الْجِدَارُ فَكَانَ لِغُلَامَيْنِ يَتِيمَيْنِ فِي الْمَدِينَةِ وَكَانَ تَحْتَهُ كَنزٌ لَّهُمَا وَكَانَ أَبُوهُمَا صَالِحًا فَأَرَادَ رَبُّكَ أَن يَبْلُغَا أَشُدَّهُمَا وَيَسْتَخْرِجَا كَنزَهُمَا رَحْمَةً مِّن رَّبِّكَ ۚ وَمَا فَعَلْتُهُ عَنْ أَمْرِي ۚ ذَٰلِكَ تَأْوِيلُ مَا لَمْ تَسْطِع عَّلَيْهِ صَبْرًا82

ఇక గోడ విషయం ఏమిటంటే, అది ఈ పట్టణంలోనే నివసిస్తున్న ఇద్దరు అనాథబాలురిది. ఆ గోడ క్రింద ఈ బాలుర కోసం ఒక నిధి పాతిపెట్టబడి ఉన్నది. వారి తండ్రి చాల మంచివాడు. అందుకని ఈ ఇద్దరు బాలురూ యుక్తవయస్కులైన పిమ్మట తమ నిధిని తాము తీసుకోవాలని నీ ప్రభువు సంకల్పించాడు. ఇదంతా నీ ప్రభువు కారుణ్యం మూలంగా నేను చేశాను. నా అంతట నేను చేయలేదు. నీవు సహనం చూపలేని విషయాల వాస్తవికత ఇది.’’

Syed Abul Aala Maudoodi

అల్-కహ్ఫ్

وَيَسْأَلُونَكَ عَن ذِي الْقَرْنَيْنِ ۖ قُلْ سَأَتْلُو عَلَيْكُم مِّنْهُ ذِكْرًا83

ప్రవక్తా! ఈ ప్రజలు నిన్ను జుల్‌ఖర్‌నైన్‌ను గురించి అడుగుతున్నారు. వారితో ‘‘నేను అతనిని గురించి మీకు కొంచెం వినిపిస్తాను’’ అని అను.

Syed Abul Aala Maudoodi

అల్-కహ్ఫ్

إِنَّا مَكَّنَّا لَهُ فِي الْأَرْضِ وَآتَيْنَاهُ مِن كُلِّ شَيْءٍ سَبَبًا84

మేము అతనికి ధరణిలో అధికారాన్ని ప్రసాదించాము. అతనికి అన్ని రకాల సాధనాలనూ, వనరులనూ ఇచ్చాము.

Syed Abul Aala Maudoodi