۞ سَيَقُولُ السُّفَهَاءُ مِنَ النَّاسِ مَا وَلَّاهُمْ عَن قِبْلَتِهِمُ الَّتِي كَانُوا عَلَيْهَا ۚ قُل لِّلَّهِ الْمَشْرِقُ وَالْمَغْرِبُ ۚ يَهْدِي مَن يَشَاءُ إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ142
మూర్ఖజనులు ఇలా అంటారు : ‘‘పూర్వం ఏ ఖిబ్లా వైపునకు తిరిగి వారు నమాజు చేసేవారో, దాని నుండి ఇంత అకస్మాత్తుగా మరలటానికి కారణం?’’ ప్రవక్తా! వారితో ఇలా అను : ‘‘ప్రాక్పశ్చిమాలు అన్నీ అల్హాహ్వే. అల్లాహ్ తాను కోరిన వారికి రుజుమార్గం చూపుతాడు.’’
Syed Abul Aala Maudoodi
وَكَذَٰلِكَ جَعَلْنَاكُمْ أُمَّةً وَسَطًا لِّتَكُونُوا شُهَدَاءَ عَلَى النَّاسِ وَيَكُونَ الرَّسُولُ عَلَيْكُمْ شَهِيدًا ۗ وَمَا جَعَلْنَا الْقِبْلَةَ الَّتِي كُنتَ عَلَيْهَا إِلَّا لِنَعْلَمَ مَن يَتَّبِعُ الرَّسُولَ مِمَّن يَنقَلِبُ عَلَىٰ عَقِبَيْهِ ۚ وَإِن كَانَتْ لَكَبِيرَةً إِلَّا عَلَى الَّذِينَ هَدَى اللَّهُ ۗ وَمَا كَانَ اللَّهُ لِيُضِيعَ إِيمَانَكُمْ ۚ إِنَّ اللَّهَ بِالنَّاسِ لَرَءُوفٌ رَّحِيمٌ143
ఈవిధంగా మేము మిమ్మల్ని ఒక ‘‘మధ్యస్థ సమాజం’’గా చేశాము. ఇకపై మీరు సమస్త మానవజాతికి సాక్షులుగా ఉంటారు. ప్రవక్త మీకు సాక్షిగా ఉంటాడు.ఎవరు ప్రవక్తను అనుసరిస్తారో, ఎవరు వెనుతిరిగి పోతారో పరీక్షించాలనే మేము పూర్వం మీరు మీ ముఖాన్ని ఏ దిక్కు వైపునకు తిప్పేవారో ఆ దిక్కునే మీ ఖిబ్లాగా నిర్ణయించాము. ఇది నిజంగా ఎంతో కఠినమైన విషయం! కాని అల్లాహ్ సన్మార్గ భాగ్యం కలుగజేసిన వారికి ఇది ఏ మాత్రం కష్టతరం కాలేదు. ఈ మీ విశ్వాసాన్ని అల్లాహ్ ఏ మాత్రం వృధాకానివ్వడు. మానవుల పట్ల అల్లాహ్ కు ఎంతో కరుణ, వాత్సల్యం ఉన్నాయనే విషయాన్ని నిశ్చయంగా నమ్మండి.
Syed Abul Aala Maudoodi
قَدْ نَرَىٰ تَقَلُّبَ وَجْهِكَ فِي السَّمَاءِ ۖ فَلَنُوَلِّيَنَّكَ قِبْلَةً تَرْضَاهَا ۚ فَوَلِّ وَجْهَكَ شَطْرَ الْمَسْجِدِ الْحَرَامِ ۚ وَحَيْثُ مَا كُنتُمْ فَوَلُّوا وُجُوهَكُمْ شَطْرَهُ ۗ وَإِنَّ الَّذِينَ أُوتُوا الْكِتَابَ لَيَعْلَمُونَ أَنَّهُ الْحَقُّ مِن رَّبِّهِمْ ۗ وَمَا اللَّهُ بِغَافِلٍ عَمَّا يَعْمَلُونَ144
ప్రవక్తా! నీవు మాటిమాటికీ నీ ముఖాన్ని ఆకాశం వైపునకు ఎత్తటం మేము గమనిస్తూనే ఉన్నాము. ఇదిగో, నీకు అత్యంత ప్రీతికరమైన ఖిబ్లా వైపునకే ఇప్పుడు మేము నిన్ను త్రిప్పుతున్నాము. కాబట్టి నీవు ముఖాన్ని ‘మస్‌జిదె హరామ్’ వైపునకు త్రిప్పు. ఇకపై మీరెక్కడున్నాసరే, ముఖాన్ని ఆ వైపునకు పెట్టి నమాజు చెయ్యండి. (ఖిబ్లా మార్పునకు సంబంధించిన) ఈ ఆదేశాన్ని వారి ప్రభువే ఇచ్చాడనీ, అది సత్యం అనీ గ్రంథ ప్రజలకు బాగా తెలుసు. కాని ఇది తెలిపిన తరువాత కూడ, వారు ఏమి చేస్తున్నారో, దానిని అల్లాహ్ గమనించకుండా ఉండటం లేదు.
Syed Abul Aala Maudoodi
وَلَئِنْ أَتَيْتَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ بِكُلِّ آيَةٍ مَّا تَبِعُوا قِبْلَتَكَ ۚ وَمَا أَنتَ بِتَابِعٍ قِبْلَتَهُمْ ۚ وَمَا بَعْضُهُم بِتَابِعٍ قِبْلَةَ بَعْضٍ ۚ وَلَئِنِ اتَّبَعْتَ أَهْوَاءَهُم مِّن بَعْدِ مَا جَاءَكَ مِنَ الْعِلْمِ ۙ إِنَّكَ إِذًا لَّمِنَ الظَّالِمِينَ145
గ్రంథ ప్రజలకు నీవు ఏ నిదర్శనం చూపినా, వారు నీ ఖిబ్లాను అనుసరించటం సంభవించదు. వారి ఖిబ్లాను అనుసరించటం నీకూ సాధ్యపడదు. వారిలోని ఏ వర్గం వారు కూడా మరొకరి ఖిబ్లాను అనుసరించటానికి తయారుగా లేరు. నీవు ఈ జ్ఞానం పొందిన తరువాత కూడ, ఒకవేళ నీవు వారి కోరికలను అనుసరిస్తే, నిశ్చయంగా దుర్మార్గులలో చేరిపోతావు.
Syed Abul Aala Maudoodi
الَّذِينَ آتَيْنَاهُمُ الْكِتَابَ يَعْرِفُونَهُ كَمَا يَعْرِفُونَ أَبْنَاءَهُمْ ۖ وَإِنَّ فَرِيقًا مِّنْهُمْ لَيَكْتُمُونَ الْحَقَّ وَهُمْ يَعْلَمُونَ146
మేము ఎవరికి గ్రంథం ప్రసాదించామో, వారు తమ సంతానాన్ని ఏవిధంగా గుర్తిస్తారో అదేవిధంగా (ఖిబ్లాగా నిర్ణయింపబడిన) ఈ స్థలాన్ని గుర్తిస్తారు. కాని వారిలోని ఒక వర్గం బుద్ధిపూర్వకంగా సత్యాన్ని కప్పిపుచ్చుతోంది.
Syed Abul Aala Maudoodi
الْحَقُّ مِن رَّبِّكَ ۖ فَلَا تَكُونَنَّ مِنَ الْمُمْتَرِينَ147
నిస్సందేహంగా ఇది మీ ప్రభువు నుండి వచ్చిన సత్యం. కనుక దీని విషయంలో మీరు ఏమాత్రం సంశయంలో పడకండి.
Syed Abul Aala Maudoodi
وَلِكُلٍّ وِجْهَةٌ هُوَ مُوَلِّيهَا ۖ فَاسْتَبِقُوا الْخَيْرَاتِ ۚ أَيْنَ مَا تَكُونُوا يَأْتِ بِكُمُ اللَّهُ جَمِيعًا ۚ إِنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ148
ప్రతి ఒక్కడికి ఒక దిక్కు ఉన్నది. దాని వైపునకు అతడు తిరుగుతాడు. కనుక మీరు మంచి పనులలో మిన్నగా ఉండటానికి ప్రయత్నించండి. మీరంతా ఎక్కడున్నాసరే అల్లాహ్ మిమ్మల్ని కనుగొంటాడు. ఆయన శక్తికి అతీతమైనది ఏదీ లేదు.
Syed Abul Aala Maudoodi
وَمِنْ حَيْثُ خَرَجْتَ فَوَلِّ وَجْهَكَ شَطْرَ الْمَسْجِدِ الْحَرَامِ ۖ وَإِنَّهُ لَلْحَقُّ مِن رَّبِّكَ ۗ وَمَا اللَّهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُونَ149
మీరు ఏ ప్రాంతంలో ప్రయాణం చేసినా, మీ ముఖాన్ని (నమాజు సమయంలో) ‘మస్‌జిదె హరామ్’ వైపునకు త్రిప్పండి. ఎందుకంటే ఇది మీ ప్రభువు చేసిన న్యాయమైన నిర్ణయం. మీ కర్మలను అల్లాహ్ గమనించకుండా ఉండటం లేదు.
Syed Abul Aala Maudoodi
وَمِنْ حَيْثُ خَرَجْتَ فَوَلِّ وَجْهَكَ شَطْرَ الْمَسْجِدِ الْحَرَامِ ۚ وَحَيْثُ مَا كُنتُمْ فَوَلُّوا وُجُوهَكُمْ شَطْرَهُ لِئَلَّا يَكُونَ لِلنَّاسِ عَلَيْكُمْ حُجَّةٌ إِلَّا الَّذِينَ ظَلَمُوا مِنْهُمْ فَلَا تَخْشَوْهُمْ وَاخْشَوْنِي وَلِأُتِمَّ نِعْمَتِي عَلَيْكُمْ وَلَعَلَّكُمْ تَهْتَدُونَ150
మీరు ఏ ప్రదేశంలో ప్రయాణం చేసినా, మీ ముఖాన్ని ‘మస్‌జిదె హరామ్’ వైపునకే త్రిప్పండి. మీరు ఎక్కడున్నాసరే, దాని వైపునకే తిరిగి నమాజు చెయ్యండి. దీనివల్ల మీకు వ్యతిరేకంగా వాదించటానికి ప్రజలకు అవకాశం లభించదు - కాని వారిలో దుర్మార్గులైన వారి నోరు ఎట్టి పరిస్థితులలోనూ ఊరుకోదు. అందుకని వారికి భయపడకండి, నాకు భయపడండి. ఇంకా నేను మీపై నా అనుగ్రహాన్ని పూర్తిచేస్తాను. మీరు నా ఈ ఆజ్ఞాపాలన ద్వారా సాఫల్య మార్గం పొందే అవకాశం ఉంది. ఆ ప్రకారంగానే (ఈ విషయాల వల్ల మీకు సాఫల్య భాగ్యం కలిగింది.)
Syed Abul Aala Maudoodi
كَمَا أَرْسَلْنَا فِيكُمْ رَسُولًا مِّنكُمْ يَتْلُو عَلَيْكُمْ آيَاتِنَا وَيُزَكِّيكُمْ وَيُعَلِّمُكُمُ الْكِتَابَ وَالْحِكْمَةَ وَيُعَلِّمُكُم مَّا لَمْ تَكُونُوا تَعْلَمُونَ151
మేము మీలో నుండే ఒకరిని ప్రవక్తగా మీ మధ్యకు పంపాము. అతను మీకు మా వాక్యాలను వినిపిస్తాడు. మీ జీవితాలను తీర్చిదిద్దుతాడు. మీకు గ్రంథాన్నీ, దివ్య జ్ఞానాన్నీ బోధిస్తాడు. మీకు తెలియని ఎన్నో విషయాలు నేర్పుతాడు.
Syed Abul Aala Maudoodi