۞ وَلَا تُجَادِلُوا أَهْلَ الْكِتَابِ إِلَّا بِالَّتِي هِيَ أَحْسَنُ إِلَّا الَّذِينَ ظَلَمُوا مِنْهُمْ ۖ وَقُولُوا آمَنَّا بِالَّذِي أُنزِلَ إِلَيْنَا وَأُنزِلَ إِلَيْكُمْ وَإِلَـٰهُنَا وَإِلَـٰهُكُمْ وَاحِدٌ وَنَحْنُ لَهُ مُسْلِمُونَ46
గ్రంథ ప్రజలతో వాదించకు, ఉత్తమమైన రీతిలో తప్ప - అయితే వారిలోని దుర్మార్గులతో మాత్రం కాదు - వారితో ఇలా అను, ‘‘మేము మా వద్దకు పంపబడిన దానినీ విశ్వసించాము, మీ వద్దకు పంపబడిన దానినీ విశ్వసించాము. మా దేవుడూ, మీ దేవుడూ ఒక్కడే, మేము ఆయనకే విధే యులం.’’
Syed Abul Aala Maudoodi
وَكَذَٰلِكَ أَنزَلْنَا إِلَيْكَ الْكِتَابَ ۚ فَالَّذِينَ آتَيْنَاهُمُ الْكِتَابَ يُؤْمِنُونَ بِهِ ۖ وَمِنْ هَـٰؤُلَاءِ مَن يُؤْمِنُ بِهِ ۚ وَمَا يَجْحَدُ بِآيَاتِنَا إِلَّا الْكَافِرُونَ47
(ఓ ప్రవక్తా!) ఇదే విధంగా మేము నీపై గ్రంథాన్ని అవతరింప జేశాము. అందువల్ల పూర్వం మేము గ్రంథాన్ని ఇచ్చినవారు దీనిని విశ్వసిస్తారు. ఈ ప్రజలలోని వారు కూడ చాలామంది దీనిని విశ్వసిస్తున్నారు. మా ఆయతు లను కేవలం అవిశ్వాసులు మాత్రమే తిరస్కరిస్తారు.
Syed Abul Aala Maudoodi
وَمَا كُنتَ تَتْلُو مِن قَبْلِهِ مِن كِتَابٍ وَلَا تَخُطُّهُ بِيَمِينِكَ ۖ إِذًا لَّارْتَابَ الْمُبْطِلُونَ48
(ప్రవక్తా!) నీవు ఇంతకు పూర్వం ఏ గ్రంథాన్నీ చదివేవాడవు కావు నీ చేతితో వ్రాసేవాడవూ కావు. ఒకవేళ అలా జరిగి ఉంటే, అసత్య వాదులు అనుమానానికి లోనై ఉండేవారు.
Syed Abul Aala Maudoodi
بَلْ هُوَ آيَاتٌ بَيِّنَاتٌ فِي صُدُورِ الَّذِينَ أُوتُوا الْعِلْمَ ۚ وَمَا يَجْحَدُ بِآيَاتِنَا إِلَّا الظَّالِمُونَ49
అసలు ఇవి జ్ఞానం ప్రసాదించబడిన వారి హృదయాలకు స్పష్టమైన సూచనలు. మా ఆయతులను దుర్మార్గపు ప్రజలు తప్ప మరెవ్వరూ తిరస్కరించరు.
Syed Abul Aala Maudoodi
وَقَالُوا لَوْلَا أُنزِلَ عَلَيْهِ آيَاتٌ مِّن رَّبِّهِ ۖ قُلْ إِنَّمَا الْآيَاتُ عِندَ اللَّهِ وَإِنَّمَا أَنَا نَذِيرٌ مُّبِينٌ50
వారు ఇలా అంటారు, ‘‘ఇతని ప్రభువు తరఫు నుండి ఇతనిపై సూచనలు ఎందుకు దించబడలేదు?’’ ఇలా అను, ‘‘సూచనలు అల్లాహ్ వద్ద ఉన్నాయి. నేను కేవలం స్పష్టంగా హెచ్చరించే వాణ్ణి మాత్రమే.’’
Syed Abul Aala Maudoodi
أَوَلَمْ يَكْفِهِمْ أَنَّا أَنزَلْنَا عَلَيْكَ الْكِتَابَ يُتْلَىٰ عَلَيْهِمْ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَرَحْمَةً وَذِكْرَىٰ لِقَوْمٍ يُؤْمِنُونَ51
మేము నీపై అవతరింపజేసిన గ్రంథం వారి ముందు చదివి వినిపించబడుతోంది - ఇది (ఈ సూచన) వారికొరకు సరిపోదా? వాస్తవానికి ఇందులో కారుణ్యం ఉన్నది. విశ్వాసులకు హితబోధ ఉన్నది.
Syed Abul Aala Maudoodi
قُلْ كَفَىٰ بِاللَّهِ بَيْنِي وَبَيْنَكُمْ شَهِيدًا ۖ يَعْلَمُ مَا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۗ وَالَّذِينَ آمَنُوا بِالْبَاطِلِ وَكَفَرُوا بِاللَّهِ أُولَـٰئِكَ هُمُ الْخَاسِرُونَ52
(ప్రవక్తా!) ఇలా అను, ‘‘నాకూ మీకూ మధ్య సాక్షిగా అల్లాహ్ యే సరిపోతాడు. ఆయన ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న సమస్తాన్నీ ఎరిగినవాడు, అసత్యాన్ని విశ్వసించి, అల్లాహ్ ను తిరస్కరించేవారే అసలు నష్టానికి గురి అయ్యేవారు.
Syed Abul Aala Maudoodi
وَيَسْتَعْجِلُونَكَ بِالْعَذَابِ ۚ وَلَوْلَا أَجَلٌ مُّسَمًّى لَّجَاءَهُمُ الْعَذَابُ وَلَيَأْتِيَنَّهُم بَغْتَةً وَهُمْ لَا يَشْعُرُونَ53
వారు, శిక్షను త్వరగా తీసుకురావాలని నిన్ను కోరుతున్నారు. సమయం ఒకటి నిర్ణయమై ఉండకపోతే, వారి మీదకు శిక్ష ఎప్పుడో వచ్చిపడి ఉండేది. నిశ్చయంగా (సమయం రాగానే) ఆ శిక్ష వచ్చి తీరుతుంది, అకస్మా త్తుగా వస్తుంది, వారికి ఏమాత్రం తెలియని స్థితిలో వస్తుంది,
Syed Abul Aala Maudoodi
يَسْتَعْجِلُونَكَ بِالْعَذَابِ وَإِنَّ جَهَنَّمَ لَمُحِيطَةٌ بِالْكَافِرِينَ54
వారు శిక్షను త్వరగా తీసుకురమ్మని కోరుతున్నారు. వాస్తవానికి ఈ అవిశ్వాసులను నరకం ఎప్పుడో చుట్టుముట్టింది.
Syed Abul Aala Maudoodi
يَوْمَ يَغْشَاهُمُ الْعَذَابُ مِن فَوْقِهِمْ وَمِن تَحْتِ أَرْجُلِهِمْ وَيَقُولُ ذُوقُوا مَا كُنتُمْ تَعْمَلُونَ55
ఆ రోజున (వారికి ఈ విషయం తెలిసిపోతుంది) అప్పుడు శిక్ష వారిని పైనుండి కూడా కప్పివేస్తుంది, పాదాల క్రిందనుంచి కూడా కప్పివేస్తుంది ‘‘ఇక రుచిచూడండి మీరు చేసిన చేష్టలకు’’ అని అంటుంది.
Syed Abul Aala Maudoodi