۞ وَمَن يَقْنُتْ مِنكُنَّ لِلَّهِ وَرَسُولِهِ وَتَعْمَلْ صَالِحًا نُّؤْتِهَا أَجْرَهَا مَرَّتَيْنِ وَأَعْتَدْنَا لَهَا رِزْقًا كَرِيمًا31
మీలో ఎవరు అల్లాహ్ కు, ఆయన ప్రవక్తకు విధేయత చూపుతారో, సత్కార్యాలు చేస్తారో, ఆమెకు మేము రెట్టింపు ప్రతిఫలం ఇస్తాము. మేము ఆమెకు గౌరవప్రదమైన ఉపాధిని సిద్ధపరచి ఉంచాము.
Syed Abul Aala Maudoodi
يَا نِسَاءَ النَّبِيِّ لَسْتُنَّ كَأَحَدٍ مِّنَ النِّسَاءِ ۚ إِنِ اتَّقَيْتُنَّ فَلَا تَخْضَعْنَ بِالْقَوْلِ فَيَطْمَعَ الَّذِي فِي قَلْبِهِ مَرَضٌ وَقُلْنَ قَوْلًا مَّعْرُوفًا32
ప్రవక్త భార్యలారా! మీరు సాధారణ స్త్రీల వంటి వారు కారు. మీరు అల్లాహ్ కు భయపడేవారు అయితే, తగ్గు స్వరంతో మాట్లాడకండి, ఎందుకంటే దుష్ట మనస్సు గల వ్యక్తి ఎవడైనా వ్యామోహపడవచ్చు. కాబట్టి స్పష్టంగా, సూటిగా మాట్లాడండి.
Syed Abul Aala Maudoodi
وَقَرْنَ فِي بُيُوتِكُنَّ وَلَا تَبَرَّجْنَ تَبَرُّجَ الْجَاهِلِيَّةِ الْأُولَىٰ ۖ وَأَقِمْنَ الصَّلَاةَ وَآتِينَ الزَّكَاةَ وَأَطِعْنَ اللَّهَ وَرَسُولَهُ ۚ إِنَّمَا يُرِيدُ اللَّهُ لِيُذْهِبَ عَنكُمُ الرِّجْسَ أَهْلَ الْبَيْتِ وَيُطَهِّرَكُمْ تَطْهِيرًا33
ఇళ్లల్లోనే ఉండిపొండి. పూర్వపు అజ్ఞాన కాలంలో మాదిరిగా అలంకరణను ప్రదర్శిస్తూ తిరగకండి. నమాజును స్థాపిం చండి, జకాత్ ఇవ్వండి. అల్లాహ్కూ, ఆయన ప్రవక్తకూ విధేయత చూపండి. దైవప్రవక్త కుటుంబీకులైన మీ నుండి కల్మషాన్ని తొలగించాలని, మిమ్మల్ని పూర్తిగా పరిశుద్ధపరచాలని అల్లాహ్ కోరుతున్నాడు.
Syed Abul Aala Maudoodi
وَاذْكُرْنَ مَا يُتْلَىٰ فِي بُيُوتِكُنَّ مِنْ آيَاتِ اللَّهِ وَالْحِكْمَةِ ۚ إِنَّ اللَّهَ كَانَ لَطِيفًا خَبِيرًا34
మీ ఇళ్లల్లో వినిపించబడే అల్లాహ్ వాక్యాలనూ, వివేకంతో కూడుకున్న విషయాలనూ జ్ఞాపకముంచు కోండి. నిస్సందేహంగా అల్లాహ్ అత్యంత సూక్ష్మగ్రాహి, అన్నీ తెలిసినవాడు.
Syed Abul Aala Maudoodi
إِنَّ الْمُسْلِمِينَ وَالْمُسْلِمَاتِ وَالْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ وَالْقَانِتِينَ وَالْقَانِتَاتِ وَالصَّادِقِينَ وَالصَّادِقَاتِ وَالصَّابِرِينَ وَالصَّابِرَاتِ وَالْخَاشِعِينَ وَالْخَاشِعَاتِ وَالْمُتَصَدِّقِينَ وَالْمُتَصَدِّقَاتِ وَالصَّائِمِينَ وَالصَّائِمَاتِ وَالْحَافِظِينَ فُرُوجَهُمْ وَالْحَافِظَاتِ وَالذَّاكِرِينَ اللَّهَ كَثِيرًا وَالذَّاكِرَاتِ أَعَدَّ اللَّهُ لَهُم مَّغْفِرَةً وَأَجْرًا عَظِيمًا35
నిశ్చయంగా ముస్లిములూ, విశ్వాసులూ, విధేయులూ, నిజాయితీపరులూ, సహనశీలురూ, అల్లాహ్ ముందు వినమ్రులయ్యేవారూ, దానధర్మాలు చేసే వారూ, ఉపవాసం ఉండేవారూ, తమ మర్మాంగాలను కాపాడుకునేవారూ, అల్లాహ్ ను అత్యధికంగా స్మరించేవారూ అయిన స్త్రీ పురుషుల నిమిత్తం అల్లాహ్ క్షమాభిక్షను, గొప్ప ప్రతిఫలాన్ని సిద్ధపరచి ఉంచాడు.
Syed Abul Aala Maudoodi
وَمَا كَانَ لِمُؤْمِنٍ وَلَا مُؤْمِنَةٍ إِذَا قَضَى اللَّهُ وَرَسُولُهُ أَمْرًا أَن يَكُونَ لَهُمُ الْخِيَرَةُ مِنْ أَمْرِهِمْ ۗ وَمَن يَعْصِ اللَّهَ وَرَسُولَهُ فَقَدْ ضَلَّ ضَلَالًا مُّبِينًا36
అల్లాహ్, ఆయన ప్రవక్తా, ఏ విషయంలోనైనా ఒక తీర్పు చేసినపుడు విశ్వాసి అయిన ఏ పురుషునికైనా, విశ్వాసురాలైన ఏ స్త్రీకైనా, తరువాత తమ యొక్క ఆ విషయంలో స్వయంగా మళ్లీ ఒక నిర్ణయం తీసుకునే హక్కు లేదు. ఇంకా ఎవడైనా అల్లాహ్ కు, ఆయన ప్రవక్తకు అవిధేయత చూపితే, అతను స్పష్టంగా మార్గభ్రష్టతకు గురిఅయినట్లే.
Syed Abul Aala Maudoodi
وَإِذْ تَقُولُ لِلَّذِي أَنْعَمَ اللَّهُ عَلَيْهِ وَأَنْعَمْتَ عَلَيْهِ أَمْسِكْ عَلَيْكَ زَوْجَكَ وَاتَّقِ اللَّهَ وَتُخْفِي فِي نَفْسِكَ مَا اللَّهُ مُبْدِيهِ وَتَخْشَى النَّاسَ وَاللَّهُ أَحَقُّ أَن تَخْشَاهُ ۖ فَلَمَّا قَضَىٰ زَيْدٌ مِّنْهَا وَطَرًا زَوَّجْنَاكَهَا لِكَيْ لَا يَكُونَ عَلَى الْمُؤْمِنِينَ حَرَجٌ فِي أَزْوَاجِ أَدْعِيَائِهِمْ إِذَا قَضَوْا مِنْهُنَّ وَطَرًا ۚ وَكَانَ أَمْرُ اللَّهِ مَفْعُولًا37
ఓ ప్రవక్తా! అల్లాహ్, నీవు, ఏ వ్యక్తికి మేలు చేశారో ఆ వ్యక్తితో ‘‘నీవు నీ భార్యను విడిచి పెట్టకు, అల్లాహ్ కు భయపడు’’ అని అంటున్న ఆ సమయాన్ని జ్ఞాపకం తెచ్చుకో. అప్పుడు నీవు అల్లాహ్ బయటపెట్టదలచిన విషయాన్ని మనస్సులో దాచి ఉంచావు. నీవు ప్రజలకు భయపడు తున్నావు. వాస్తవానికి నీవు భయపడటానికి అల్లాహ్ యే ఎక్కువ హక్కుదారుడు. తరువాత జైద్ ఆమె విషయంలో తన అవసరాన్ని పూర్తి చేసుకున్నప్పుడు, మేము ఆమె (విడాకులు పొందిన స్త్రీ)తో నీకు వివాహం జరిపించాము. విశ్వాసులకు తమ దత్తపుత్రుల భార్యల విషయంలో, వారు తమ భార్యలకు సంబంధించిన తమ అవసరాన్ని పూర్తి చేసుకున్నప్పుడు, ఏ విధమైన ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు. అల్లాహ్ ఆదేశం అమలులోకి రావలసిందే.
Syed Abul Aala Maudoodi
مَّا كَانَ عَلَى النَّبِيِّ مِنْ حَرَجٍ فِيمَا فَرَضَ اللَّهُ لَهُ ۖ سُنَّةَ اللَّهِ فِي الَّذِينَ خَلَوْا مِن قَبْلُ ۚ وَكَانَ أَمْرُ اللَّهِ قَدَرًا مَّقْدُورًا38
అల్లాహ్ తనకు విధించిన ఏ పనినైనా చేయటంలో దైవప్రవక్తకు ఏ ప్రతిబంధకమూ లేదు. గతించిన దైవప్రవక్తలందరి విషయంలోనూ అల్లాహ్ యొక్క ఈ సంప్రదాయమే అమలులో ఉండేది. అల్లాహ్ ఆజ్ఞ పూర్తిగా తిరుగులేని తీర్పు.
Syed Abul Aala Maudoodi
الَّذِينَ يُبَلِّغُونَ رِسَالَاتِ اللَّهِ وَيَخْشَوْنَهُ وَلَا يَخْشَوْنَ أَحَدًا إِلَّا اللَّهَ ۗ وَكَفَىٰ بِاللَّهِ حَسِيبًا39
(ఇది అల్లాహ్ సంప్రదాయం) అల్లాహ్ సందేశాలను అందజేసే వారికి, ఆయనకు మాత్రమే భయపడేవారికి, ఒకే దేవునికి తప్ప మరెవరికీ భయపడని వారికి. లెక్క చూడటానికి కేవలం అల్లాహ్ యే చాలు.
Syed Abul Aala Maudoodi
مَّا كَانَ مُحَمَّدٌ أَبَا أَحَدٍ مِّن رِّجَالِكُمْ وَلَـٰكِن رَّسُولَ اللَّهِ وَخَاتَمَ النَّبِيِّينَ ۗ وَكَانَ اللَّهُ بِكُلِّ شَيْءٍ عَلِيمًا40
(మానవులారా) ముహమ్మద్ మీలోని ఏ పురుషునికీ తండ్రికారు. కాని ఆయన అల్లాహ్ యొక్క ప్రవక్త, దైవప్రవక్తల పరంపరను సమాప్తం చేసే చివరివారు. అల్లాహ్ సకల విషయాల జ్ఞానం కలవాడు.
Syed Abul Aala Maudoodi