అల్-జుమర్

۞ فَمَنْ أَظْلَمُ مِمَّن كَذَبَ عَلَى اللَّهِ وَكَذَّبَ بِالصِّدْقِ إِذْ جَاءَهُ ۚ أَلَيْسَ فِي جَهَنَّمَ مَثْوًى لِّلْكَافِرِينَ32

ఎవడు అల్లాహ్ కు అబద్ధాన్ని ఆపాదిస్తాడో, సత్యం అతడి ముందుకు వచ్చినప్పుడు అది అబద్ధమని దానిని తిరస్కరిస్తాడో, అతడికంటే పరమ దుర్మార్గుడెవడు? అటువంటి వారికి నరకంలో స్థానమేమీ లేదా?

Syed Abul Aala Maudoodi

అల్-జుమర్

وَالَّذِي جَاءَ بِالصِّدْقِ وَصَدَّقَ بِهِ ۙ أُولَـٰئِكَ هُمُ الْمُتَّقُونَ33

సత్యాన్ని తీసుకు వచ్చిన వ్యక్తీ, అది సత్యమని అంగీకరించిన ప్రజలూ మాత్రమే శిక్ష తప్పించుకుంటారు.

Syed Abul Aala Maudoodi

అల్-జుమర్

لَهُم مَّا يَشَاءُونَ عِندَ رَبِّهِمْ ۚ ذَٰلِكَ جَزَاءُ الْمُحْسِنِينَ34

వారికి తమ ప్రభువు వద్ద వారు కోరుకునేదంతా లభిస్తుంది. ఇది సత్కార్యాలు చేసే వారికి దొరికే ప్రతిఫలం.

Syed Abul Aala Maudoodi

అల్-జుమర్

لِيُكَفِّرَ اللَّهُ عَنْهُمْ أَسْوَأَ الَّذِي عَمِلُوا وَيَجْزِيَهُمْ أَجْرَهُم بِأَحْسَنِ الَّذِي كَانُوا يَعْمَلُونَ35

వారు చేసిన అత్యంత ఘోరమైన పనులను అల్లాహ్ వారి లెక్క నుండి తీసివెయ్యటానికి, వారు చేసిన ఎంతో మంచి పనులకు గాను వారికి ప్రతిఫలం ప్రసాదించ టానికి.

Syed Abul Aala Maudoodi

అల్-జుమర్

أَلَيْسَ اللَّهُ بِكَافٍ عَبْدَهُ ۖ وَيُخَوِّفُونَكَ بِالَّذِينَ مِن دُونِهِ ۚ وَمَن يُضْلِلِ اللَّهُ فَمَا لَهُ مِنْ هَادٍ36

(ఓ ప్రవక్తా!) అల్లాహ్ తన దాసునికి సరిపోడా? వారు ఆయనను గురించి కాక, ఇతరులను గురించి నిన్ను భయపెడుతున్నారు. వాస్తవానికి, అల్లాహ్ దారి తప్పించేవాడికి దారిచూపే వాడెవ్వడూ లేడు.

Syed Abul Aala Maudoodi

అల్-జుమర్

وَمَن يَهْدِ اللَّهُ فَمَا لَهُ مِن مُّضِلٍّ ۗ أَلَيْسَ اللَّهُ بِعَزِيزٍ ذِي انتِقَامٍ37

ఆయన దారి చూపేవాడిని దారి తప్పించేవాడు కూడ ఎవ్వడూ లేడు. అల్లాహ్ మహాశక్తి మంతుడూ, ప్రతీకారం చేసేవాడూ కాడా?

Syed Abul Aala Maudoodi

అల్-జుమర్

وَلَئِن سَأَلْتَهُم مَّنْ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ لَيَقُولُنَّ اللَّهُ ۚ قُلْ أَفَرَأَيْتُم مَّا تَدْعُونَ مِن دُونِ اللَّهِ إِنْ أَرَادَنِيَ اللَّهُ بِضُرٍّ هَلْ هُنَّ كَاشِفَاتُ ضُرِّهِ أَوْ أَرَادَنِي بِرَحْمَةٍ هَلْ هُنَّ مُمْسِكَاتُ رَحْمَتِهِ ۚ قُلْ حَسْبِيَ اللَّهُ ۖ عَلَيْهِ يَتَوَكَّلُ الْمُتَوَكِّلُونَ38

ఒకవేళ నీవు వారిని, భూమ్యా కాశాలను ఎవడు సృష్టించాడు అని అడిగితే, వారే స్వయంగా, ‘‘అల్లాహ్ యే’’ అని అంటారు. వారిని ఇలా అడుగు:‘‘యథార్థం ఇదైనప్పుడు, ఒకవేళ అల్లాహ్ నాకేదైనా నష్టాన్ని కలిగించగోరితే, మీరు అల్లాహ్ ను కాదని వేడుకునే మీ దేవీలు, ఆయన కలిగించే నష్టం నుండి నన్ను కాపాడగలరా? లేదా అల్లాహ్ నాపై కనికరం చూపగోరితే, వారు ఆయన కారుణ్యాన్ని అడ్డుకోగలరా? మీ అభిప్రాయమేమిటి? కనుక వారితో ఇలా అను,‘‘నాకు అల్లాహ్ ఒక్కడే చాలు, నమ్ముకునే వారు ఆయననే నమ్ముకుంటారు.’’

Syed Abul Aala Maudoodi

అల్-జుమర్

قُلْ يَا قَوْمِ اعْمَلُوا عَلَىٰ مَكَانَتِكُمْ إِنِّي عَامِلٌ ۖ فَسَوْفَ تَعْلَمُونَ39

వారికి స్పష్టంగా ఇలా చెప్పు, ‘‘నా జాతి ప్రజలారా! మీరు మీ ఇష్టం ప్రకారం మీ పనులు చేస్తూ ఉండండి. నా పనేదో నేనూ చేస్తూ ఉంటాను. త్వరలోనే మీకు తెలిసిపోతుంది,

Syed Abul Aala Maudoodi

అల్-జుమర్

مَن يَأْتِيهِ عَذَابٌ يُخْزِيهِ وَيَحِلُّ عَلَيْهِ عَذَابٌ مُّقِيمٌ40

ఎవరి మీదకు అవమానకరమైన శిక్ష వచ్చిపడుతుందో, ఇంకా ఎవరికి ఎన్నడూ తొలగిపోని శిక్ష లభిస్తుందో.’’

Syed Abul Aala Maudoodi

అల్-జుమర్

إِنَّا أَنزَلْنَا عَلَيْكَ الْكِتَابَ لِلنَّاسِ بِالْحَقِّ ۖ فَمَنِ اهْتَدَىٰ فَلِنَفْسِهِ ۖ وَمَن ضَلَّ فَإِنَّمَا يَضِلُّ عَلَيْهَا ۖ وَمَا أَنتَ عَلَيْهِم بِوَكِيلٍ41

(ఓ ప్రవక్తా!) మేము మానవులందరి కోసం ఈ సత్యగ్రంథాన్ని నీపై అవతరింపజేశాము. ఇక ఎవడు ఋజుమార్గాన్ని అవలంబిస్తాడో, అతడు తన మేలు కోసమే అలా చేస్తాడు. ఎవడు మార్గం తప్పుతాడో, ఆ మార్గం తప్పటమనే కీడుకు అతడే బాధ్యుడు అవుతాడు. నీవు వారికి బాధ్యుడవు కావు.

Syed Abul Aala Maudoodi