ఫుస్సిలత్

۞ إِلَيْهِ يُرَدُّ عِلْمُ السَّاعَةِ ۚ وَمَا تَخْرُجُ مِن ثَمَرَاتٍ مِّنْ أَكْمَامِهَا وَمَا تَحْمِلُ مِنْ أُنثَىٰ وَلَا تَضَعُ إِلَّا بِعِلْمِهِ ۚ وَيَوْمَ يُنَادِيهِمْ أَيْنَ شُرَكَائِي قَالُوا آذَنَّاكَ مَا مِنَّا مِن شَهِيدٍ47

ఆ గడియకు సంబంధించిన జ్ఞానం అల్లాహ్ వద్దనే ఉన్నది. తమ తొడిమల నుండి బయటికి వచ్చే ఫలాలనన్నింటినీ ఆయనే ఎరుగును. ఆయ నకు తెలియకుండా ఏ స్త్రీ అయినా గర్భం దాల్చదు, ఏ స్త్రీ అయినా ప్రసవిం చదు. ఆయన వారిని కేకవేసి, ‘‘ఎక్కడ ఉన్నారు ఆ నా భాగస్వాములు?’’ అని అడిగే రోజున వారు ఇలా అంటారు, ‘‘ఈనాడు మాలో దానికి సాక్ష్య మిచ్చేవాడు ఎవడూ లేడని మేము ఇదివరకే మనవి చేసుకున్నాము.’’

Syed Abul Aala Maudoodi

ఫుస్సిలత్

وَضَلَّ عَنْهُم مَّا كَانُوا يَدْعُونَ مِن قَبْلُ ۖ وَظَنُّوا مَا لَهُم مِّن مَّحِيصٍ48

ఆ సమయంలో వారు ఇంతకు పూర్వం మొరపెట్టుకున్న దైవాలన్నీ మటుమాయమై పోతాయి. ఇప్పుడు తమ కొరకు ఆశ్రయస్థానమనేది ఏదీ లేదని వారు గ్రహిస్తారు.

Syed Abul Aala Maudoodi

ఫుస్సిలత్

لَّا يَسْأَمُ الْإِنسَانُ مِن دُعَاءِ الْخَيْرِ وَإِن مَّسَّهُ الشَّرُّ فَيَئُوسٌ قَنُوطٌ49

మానవుడు మేలు కోసం ప్రార్థిస్తూ ఎన్నడూ అలసిపోడు. అతనికి ఏదైనా ఆపద కలిగినప్పుడు, నిరాశా నిస్పృహలకు లోనై భగ్నహృదయుడవు తాడు.

Syed Abul Aala Maudoodi

ఫుస్సిలత్

وَلَئِنْ أَذَقْنَاهُ رَحْمَةً مِّنَّا مِن بَعْدِ ضَرَّاءَ مَسَّتْهُ لَيَقُولَنَّ هَـٰذَا لِي وَمَا أَظُنُّ السَّاعَةَ قَائِمَةً وَلَئِن رُّجِعْتُ إِلَىٰ رَبِّي إِنَّ لِي عِندَهُ لَلْحُسْنَىٰ ۚ فَلَنُنَبِّئَنَّ الَّذِينَ كَفَرُوا بِمَا عَمِلُوا وَلَنُذِيقَنَّهُم مِّنْ عَذَابٍ غَلِيظٍ50

కాని కష్టకాలం తీరిపోయిన తరువాత, మేము అతనికి మా కారుణ్యాన్ని రుచి చూపినప్పుడు ఇలా అంటాడు, ‘‘నేను అసలు దీనికే అర్హుణ్ణి. ప్రళయం ఎప్పుడైనా వస్తుందని నేను అనుకోవటం లేదు. కాని ఒకవేళ నిజంగానే నేను నా ప్రభువు వైపునకు మరలింపబడితే, అక్కడ కూడా నేను సుఖాలనే అనుభవిస్తాను.’’ నిశ్చయంగా సత్య తిరస్కారులకు వారు ఏమేమి చేసి వచ్చారో మేము తప్పకుండా తెలియజేస్తాము. వారికి మేము జుగుప్సాకరమైన శిక్షను రుచి చూపిస్తాము.

Syed Abul Aala Maudoodi

ఫుస్సిలత్

وَإِذَا أَنْعَمْنَا عَلَى الْإِنسَانِ أَعْرَضَ وَنَأَىٰ بِجَانِبِهِ وَإِذَا مَسَّهُ الشَّرُّ فَذُو دُعَاءٍ عَرِيضٍ51

మానవుడికి మేము కానుకలను ప్రసాదించినప్పుడు, ముఖం త్రిప్పు కుంటాడు, విర్రవీగుతాడు. కాని అతనికి ఏదైనా ఆపద కలిగినప్పుడు, సుదీర్ఘ మైన ప్రార్థనలు చేస్తాడు.

Syed Abul Aala Maudoodi

ఫుస్సిలత్

قُلْ أَرَأَيْتُمْ إِن كَانَ مِنْ عِندِ اللَّهِ ثُمَّ كَفَرْتُم بِهِ مَنْ أَضَلُّ مِمَّنْ هُوَ فِي شِقَاقٍ بَعِيدٍ52

ప్రవక్తా! వారితో ఇలా అను : ‘‘ఎప్పుడైనా మీరు ఇలా కూడా ఆలోచించారా - ఒకవేళ నిజంగానే ఈ ఖురాన్‌ అల్లాహ్ తరఫు నుండి వచ్చి, దానిని గనక మీరు తిరస్కరిస్తూ ఉన్నట్లయితే, దానిని వ్యతిరేకించటంలో చాల దూరం వెళ్లిపోయిన వ్యక్తిని మించిన మార్గభ్రష్టుడెవడు?’’

Syed Abul Aala Maudoodi

ఫుస్సిలత్

سَنُرِيهِمْ آيَاتِنَا فِي الْآفَاقِ وَفِي أَنفُسِهِمْ حَتَّىٰ يَتَبَيَّنَ لَهُمْ أَنَّهُ الْحَقُّ ۗ أَوَلَمْ يَكْفِ بِرَبِّكَ أَنَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ شَهِيدٌ53

మేము త్వరలోనే వారికి మా సూచనలను వారి చుట్టూ ఉన్న ప్రపంచంలోనూ చూపిస్తాము, వారిలోనూ చూపిస్తాము. చివరకు ఈ ఖురాన్‌ నిస్సందేహంగా సత్యమైనదని వారికి విశదమైపోతుంది. నీ ప్రభువు ప్రతిదానికి సాక్షి అనే విషయం సరిపోదా?

Syed Abul Aala Maudoodi

ఫుస్సిలత్

أَلَا إِنَّهُمْ فِي مِرْيَةٍ مِّن لِّقَاءِ رَبِّهِمْ ۗ أَلَا إِنَّهُ بِكُلِّ شَيْءٍ مُّحِيطٌ54

తెలుసుకో, వారు తమ ప్రభువును కలుసుకునే విషయం పట్ల సందేహం కలిగి ఉన్నారు. విను, ఆయన ప్రతి వస్తువునూ పరివేష్టించి ఉన్నాడు.

Syed Abul Aala Maudoodi

بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

అల్-షూరా

حم1

హా. మీమ్‌.

Syed Abul Aala Maudoodi

అల్-షూరా

عسق2

ఐన్‌. సీన్‌. ఖాఫ్‌.

Syed Abul Aala Maudoodi