بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

سورة الأحقاف

حم1

హా. మీమ్‌.

Syed Abul Aala Maudoodi

سورة الأحقاف

تَنزِيلُ الْكِتَابِ مِنَ اللَّهِ الْعَزِيزِ الْحَكِيمِ2

ఈ గ్రంథం మహాశక్తిమంతుడూ, మహా వివేకవంతుడూ అయిన అల్లాహ్ తరఫు నుండి అవతరించింది.

Syed Abul Aala Maudoodi

سورة الأحقاف

مَا خَلَقْنَا السَّمَاوَاتِ وَالْأَرْضَ وَمَا بَيْنَهُمَا إِلَّا بِالْحَقِّ وَأَجَلٍ مُّسَمًّى ۚ وَالَّذِينَ كَفَرُوا عَمَّا أُنذِرُوا مُعْرِضُونَ3

మేము భూమినీ, ఆకాశాలనూ, వాటి మధ్య ఉన్న సకల వస్తువులనూ సత్యం ప్రకారం, ఒక ప్రత్యేక కాల నిర్ణయంతో సృష్టించాము. కాని ఏ యధార్థం గురించి ఈ అవిశ్వాసులకు హెచ్చరిక చేయబడిరదో, ఆ యధార్థా నికి వారు విముఖులయ్యారు.

Syed Abul Aala Maudoodi

سورة الأحقاف

قُلْ أَرَأَيْتُم مَّا تَدْعُونَ مِن دُونِ اللَّهِ أَرُونِي مَاذَا خَلَقُوا مِنَ الْأَرْضِ أَمْ لَهُمْ شِرْكٌ فِي السَّمَاوَاتِ ۖ ائْتُونِي بِكِتَابٍ مِّن قَبْلِ هَـٰذَا أَوْ أَثَارَةٍ مِّنْ عِلْمٍ إِن كُنتُمْ صَادِقِينَ4

ప్రవక్తా! వారితో ఇలా అను, ‘‘మీరు దేవుణ్ణి త్రోసిరాజని వేడుకుంటున్న శక్తులు అసలు ఏమిటో ఎప్పుడైనా మీరు కళ్లు తెరచి చూశారా? భూమిలో వారు సృష్టించింది ఏమిటో, కొంచెం నాకు చూపండి? లేదా ఆకాశాల సృష్టిలో, వాటి నిర్వహణలో వాటి పాత్ర ఏమైనా ఉందా? ఒకవేళ ఇదివరకు వచ్చిన ఏదైనా గ్రంథంగానీ లేదా జ్ఞాన అవశేషంగానీ (ఈ విశ్వాసాలకు ఆధారంగా) మీదగ్గర ఉంటే, దాన్నే తీసుకురండి, మీరు సత్యవంతులే అయితే.’’

Syed Abul Aala Maudoodi

سورة الأحقاف

وَمَنْ أَضَلُّ مِمَّن يَدْعُو مِن دُونِ اللَّهِ مَن لَّا يَسْتَجِيبُ لَهُ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ وَهُمْ عَن دُعَائِهِمْ غَافِلُونَ5

అల్లాహ్ ను కాదని, ప్రళయం వచ్చే వరకు అతనికి సమాధానమైనా ఇవ్వలేని వారిని, మొరపెట్టుకునే వారు తమకు మొరపెట్టుకుంటున్నారనే విషయం కూడ ఎరుగని వారిని వేడుకునే వాడికంటే పరమ భ్రష్టుడైన మానవుడు ఎవడు ఉంటాడు?

Syed Abul Aala Maudoodi

سورة الأحقاف

وَإِذَا حُشِرَ النَّاسُ كَانُوا لَهُمْ أَعْدَاءً وَكَانُوا بِعِبَادَتِهِمْ كَافِرِينَ6

మానవులందరినీ సమావేశపరచినప్పుడు, వారు తమను వేడుకున్న వారికి విరోధులైపోతారు, వారి ఆరాధనను తిరస్కరిస్తారు.

Syed Abul Aala Maudoodi

سورة الأحقاف

وَإِذَا تُتْلَىٰ عَلَيْهِمْ آيَاتُنَا بَيِّنَاتٍ قَالَ الَّذِينَ كَفَرُوا لِلْحَقِّ لَمَّا جَاءَهُمْ هَـٰذَا سِحْرٌ مُّبِينٌ7

ఎంతో స్పష్టమైన మా వాక్యాలను వారికి వినిపించినప్పుడు, సత్యం వారి ముందుకు వచ్చినప్పుడు, ఈ అవిశ్వాసులు దానిని గురించి, ‘‘ఇది స్పష్టంగా మంత్రజాలమే’’ అని అంటారు.

Syed Abul Aala Maudoodi

سورة الأحقاف

أَمْ يَقُولُونَ افْتَرَاهُ ۖ قُلْ إِنِ افْتَرَيْتُهُ فَلَا تَمْلِكُونَ لِي مِنَ اللَّهِ شَيْئًا ۖ هُوَ أَعْلَمُ بِمَا تُفِيضُونَ فِيهِ ۖ كَفَىٰ بِهِ شَهِيدًا بَيْنِي وَبَيْنَكُمْ ۖ وَهُوَ الْغَفُورُ الرَّحِيمُ8

అయితే ప్రవక్తయే దానిని కల్పిం చాడని వారి భావమా? వారితో ఇలా అను, ‘‘ఒకవేళ నేనే దానిని కల్పించి ఉన్నట్లయితే, మీరు దేవుని శిక్ష నుండి నన్ను ఏమాత్రం కాపాడలేరు. మీరు కల్పించే విషయాలను అల్లాహ్ బాగా ఎరుగును. నాకూ మీకూ మధ్య సాక్షిగా దేవుడే సరిపోతాడు. ఆయన ఎక్కువగా మన్నించేవాడు, కరుణించేవాడూను.’’

Syed Abul Aala Maudoodi

سورة الأحقاف

قُلْ مَا كُنتُ بِدْعًا مِّنَ الرُّسُلِ وَمَا أَدْرِي مَا يُفْعَلُ بِي وَلَا بِكُمْ ۖ إِنْ أَتَّبِعُ إِلَّا مَا يُوحَىٰ إِلَيَّ وَمَا أَنَا إِلَّا نَذِيرٌ مُّبِينٌ9

వారితో ఇలా అను, ‘‘నేను కొత్తప్రవక్తనేమీ కాను. రేపు మీకు ఏమి జరుగనున్నదో, నాకు ఏమి కానున్నదో, నాకైతే తెలియదు. నేను నావద్దకు పంపబడే దైవవాణి (వహీ)ని మాత్రమే అనుసరిస్తున్నాను. నేను స్పష్టంగా హెచ్చరిక చేసేవాణ్ణి తప్ప మరేమీ కాను.’’

Syed Abul Aala Maudoodi

سورة الأحقاف

قُلْ أَرَأَيْتُمْ إِن كَانَ مِنْ عِندِ اللَّهِ وَكَفَرْتُم بِهِ وَشَهِدَ شَاهِدٌ مِّن بَنِي إِسْرَائِيلَ عَلَىٰ مِثْلِهِ فَآمَنَ وَاسْتَكْبَرْتُمْ ۖ إِنَّ اللَّهَ لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ10

ప్రవక్తా! వారికి ఇలా చెప్పు: ‘‘ఒకవేళ ఈ గ్రంథం అల్లాహ్ తరఫు నుండి వచ్చి ఉండి, మీరు దానిని తిరస్కరిస్తూ ఉన్నట్లయితే, (అప్పుడు మీ గతి ఏమవుతుందో) అనే విషయం గురించి మీరెప్పుడైనా ఆలోచించారా? ఇటువంటి ఒక గ్రంథాన్ని గురించి ఇస్రాయీల్‌ సంతతికి చెందిన ఒక సాక్షి సాక్ష్యం కూడ ఇచ్చి ఉన్నాడు. అతడేమో విశ్వసించాడు, మీరేమో అహంభావానికి లోనయ్యారు. అటువంటి దుర్మార్గులకు అల్లాహ్ సన్మార్గం చూపడు.

Syed Abul Aala Maudoodi