అల్-ధారియాత్
۞ قَالَ فَمَا خَطْبُكُمْ أَيُّهَا الْمُرْسَلُونَ31
ఇబ్రాహీమ్, ‘‘దైవదూతలారా! మీరు ఏ మహాకార్యం నిమిత్తం వచ్చారు’’ అని అడిగాడు.
Syed Abul Aala Maudoodi
అల్-ధారియాత్
قَالُوا إِنَّا أُرْسِلْنَا إِلَىٰ قَوْمٍ مُّجْرِمِينَ32
వారు ఇలా అన్నారు, ‘‘మేము ఒక నేరస్తుల జాతి వైపునకు పంపబడ్డాము,
Syed Abul Aala Maudoodi
అల్-ధారియాత్
لِنُرْسِلَ عَلَيْهِمْ حِجَارَةً مِّن طِينٍ33
దాని మీద కాల్చబడిన మట్టి రాళ్లను వర్షింపజేయ టానికి.
Syed Abul Aala Maudoodi
అల్-ధారియాత్
مُّسَوَّمَةً عِندَ رَبِّكَ لِلْمُسْرِفِينَ34
అవి నీ ప్రభువు దృష్టిలో హద్దులు మీరిన వారి కొరకు గుర్తు వేయబడిన రాళ్లు.
Syed Abul Aala Maudoodi
అల్-ధారియాత్
فَأَخْرَجْنَا مَن كَانَ فِيهَا مِنَ الْمُؤْمِنِينَ35
తరువాత మేము విశ్వాసులు అందరినీ ఆ జనపదం నుండి బయటకు తీసుకువచ్చాము.
Syed Abul Aala Maudoodi
అల్-ధారియాత్
فَمَا وَجَدْنَا فِيهَا غَيْرَ بَيْتٍ مِّنَ الْمُسْلِمِينَ36
అక్కడ మేము ఒకే ఒక గృహాన్ని తప్ప మరే ముస్లిమ్ గృహాన్ని చూడలేదు.
Syed Abul Aala Maudoodi
అల్-ధారియాత్
وَتَرَكْنَا فِيهَا آيَةً لِّلَّذِينَ يَخَافُونَ الْعَذَابَ الْأَلِيمَ37
ఆ తరువాత అక్కడ మేము వ్యధాభరితమైన శిక్షకు భయపడే వారి కొరకు కేవలం ఒకే ఒక సూచనను వదలిపెట్టాము.
Syed Abul Aala Maudoodi
అల్-ధారియాత్
وَفِي مُوسَىٰ إِذْ أَرْسَلْنَاهُ إِلَىٰ فِرْعَوْنَ بِسُلْطَانٍ مُّبِينٍ38
మరియు మూసా గాధలో (మీ కొరకు సూచన ఉన్నది) మేము అతనిని స్పష్టమైన ప్రమాణంతో ఫిరౌన్ వద్దకు పంపాము.
Syed Abul Aala Maudoodi
అల్-ధారియాత్
فَتَوَلَّىٰ بِرُكْنِهِ وَقَالَ سَاحِرٌ أَوْ مَجْنُونٌ39
అతడు తన బలాన్ని చూసుకొని విర్రవీగాడు. ఇతడు మాంత్రికుడు లేదా పిచ్చివాడు అని అన్నాడు.
Syed Abul Aala Maudoodi
అల్-ధారియాత్
فَأَخَذْنَاهُ وَجُنُودَهُ فَنَبَذْنَاهُمْ فِي الْيَمِّ وَهُوَ مُلِيمٌ40
చివరకు మేము అతడినీ, అతడి సైన్యాలనూ పట్టుకున్నాము. వారందరినీ సముద్రంలోనికి విసరివేశాము. అతడు నిందింపదగినవాడుగా మిగిలిపోయాడు.
Syed Abul Aala Maudoodi