ఆల్-ఇమ్రాన్

۞ كُلُّ الطَّعَامِ كَانَ حِلًّا لِّبَنِي إِسْرَائِيلَ إِلَّا مَا حَرَّمَ إِسْرَائِيلُ عَلَىٰ نَفْسِهِ مِن قَبْلِ أَن تُنَزَّلَ التَّوْرَاةُ ۗ قُلْ فَأْتُوا بِالتَّوْرَاةِ فَاتْلُوهَا إِن كُنتُمْ صَادِقِينَ93

ఈ ఆహార పదార్థాలన్నీ (ముహమ్మద్‌ షరీయత్తులో ధర్మ సమ్మతమైనవి) ఇస్రాయీలు సంతతికి కూడ ధర్మ సమ్మతంగా ఉండేవి. కాని తౌరాతు గ్రంథం అవతరణకు పూర్వం ఇస్రాయీలు (హజ్రత్‌ యాఖూబు) స్వయంగా తనకు కొన్ని వస్తువులను నిషేధించుకున్నాడు. వారిని ఇలా అడుగు: ‘‘మీరు (అభ్యంతరం తెలుపుటలో) సత్యవంతులే అయితే తౌరాతును తీసుకురండి. దానిలోని ఏదైనా భాగాన్ని చూపించండి.

Syed Abul Aala Maudoodi

ఆల్-ఇమ్రాన్

فَمَنِ افْتَرَىٰ عَلَى اللَّهِ الْكَذِبَ مِن بَعْدِ ذَٰلِكَ فَأُولَـٰئِكَ هُمُ الظَّالِمُونَ94

దీని తరువాత కూడ ఎవరైనా అబద్ధాన్ని సృష్టించి అల్లాహ్ కు ఆపాదించినట్లయితే వారే వాస్తవానికి దుర్మార్గులు.’’

Syed Abul Aala Maudoodi

ఆల్-ఇమ్రాన్

قُلْ صَدَقَ اللَّهُ ۗ فَاتَّبِعُوا مِلَّةَ إِبْرَاهِيمَ حَنِيفًا وَمَا كَانَ مِنَ الْمُشْرِكِينَ95

వారికి ఇలా బోధించు : ‘‘అల్లాహ్ చెప్పింది నిజం. కనుక మీరు ఏకాగ్ర మనస్కులై ఇబ్రాహీము పద్ధతినే అనుసరించాలి. ఇబ్రాహీము షిర్కు చేసే వారిలోని వాడు కాదు.’’

Syed Abul Aala Maudoodi

ఆల్-ఇమ్రాన్

إِنَّ أَوَّلَ بَيْتٍ وُضِعَ لِلنَّاسِ لَلَّذِي بِبَكَّةَ مُبَارَكًا وَهُدًى لِّلْعَالَمِينَ96

ప్రప్రథమంగా మానవుల కొరకు నిర్మించబడిన ఆరాధనా గృహం నిస్సందేహంగా మక్కాలో ఉన్నదే. దానికి సకల శుభాలు ప్రసాదించబడ్డాయి. విశ్వప్రజలందరికీ అది మార్గదర్శక కేంద్రంగా రూపొందించబడిరది.

Syed Abul Aala Maudoodi

ఆల్-ఇమ్రాన్

فِيهِ آيَاتٌ بَيِّنَاتٌ مَّقَامُ إِبْرَاهِيمَ ۖ وَمَن دَخَلَهُ كَانَ آمِنًا ۗ وَلِلَّهِ عَلَى النَّاسِ حِجُّ الْبَيْتِ مَنِ اسْتَطَاعَ إِلَيْهِ سَبِيلًا ۚ وَمَن كَفَرَ فَإِنَّ اللَّهَ غَنِيٌّ عَنِ الْعَالَمِينَ97

దానిలో స్పష్టమైన సూచనలు ఉన్నాయి, ఇబ్రాహీము యొక్క ప్రార్థనాస్థలం ఉన్నది. దానిలో ప్రవేశించినవాడు రక్షణ పొందుతాడు. ప్రజలపై అల్లాహ్ కు ఉన్న హక్కు ఏమిటంటే, ఈ గృహానికి వెళ్ళే శక్తిగలవారు దాని హజ్‌ను విధిగా చెయ్యాలి. ఈ ఆజ్ఞను పాలించటానికి తిరస్క రించేవాడు అల్లాహ్ కు ప్రపంచ ప్రజల అవసరం ఎంతమాత్రం లేదు అని స్పష్టంగా తెలుసుకోవాలి.

Syed Abul Aala Maudoodi

ఆల్-ఇమ్రాన్

قُلْ يَا أَهْلَ الْكِتَابِ لِمَ تَكْفُرُونَ بِآيَاتِ اللَّهِ وَاللَّهُ شَهِيدٌ عَلَىٰ مَا تَعْمَلُونَ98

ఇలా చెప్పు: ‘‘గ్రంథ ప్రజలారా! మీరు అల్లాహ్ మాటలను ఎందుకు తిరస్కరిస్తారు? మీరు చేసే చేష్టలన్నింటినీ అల్లాహ్ కనిపెడుతూనే ఉన్నాడు.’’

Syed Abul Aala Maudoodi

ఆల్-ఇమ్రాన్

قُلْ يَا أَهْلَ الْكِتَابِ لِمَ تَصُدُّونَ عَن سَبِيلِ اللَّهِ مَنْ آمَنَ تَبْغُونَهَا عِوَجًا وَأَنتُمْ شُهَدَاءُ ۗ وَمَا اللَّهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُونَ99

ఇంకా ఇలా అను : ‘‘గ్రంథ ప్రజలారా! ఏమిటి మీ ఈ వైఖరి, అల్లాహ్ మాటను విశ్వసించే వాణ్ణి కూడా అల్లాహ్ మార్గంపై నడవకుండా అడ్డుకుంటున్నారా? (అతడు సత్యమార్గంపై ఉన్నాడనటానికి) స్వయంగా మీరే సాక్షులై కూడా అతడు వక్రమార్గంలో నడవాలని కోరుకుంటున్నారా? అల్లాహ్ మీ చేష్టలపట్ల అజాగ్రత్తగా లేడు.’’

Syed Abul Aala Maudoodi

ఆల్-ఇమ్రాన్

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِن تُطِيعُوا فَرِيقًا مِّنَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ يَرُدُّوكُم بَعْدَ إِيمَانِكُمْ كَافِرِينَ100

విశ్వసించిన ప్రజలారా! మీరు గ్రంథ ప్రజలలోని ఒక వర్గం వారి మాటను వింటే, వారు మిమ్మల్ని విశ్వాసం నుండి మళ్ళీ అవిశ్వాసం దెసకు మరలిస్తారు.

Syed Abul Aala Maudoodi

ఆల్-ఇమ్రాన్

وَكَيْفَ تَكْفُرُونَ وَأَنتُمْ تُتْلَىٰ عَلَيْكُمْ آيَاتُ اللَّهِ وَفِيكُمْ رَسُولُهُ ۗ وَمَن يَعْتَصِم بِاللَّهِ فَقَدْ هُدِيَ إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ101

మీరు అవిశ్వాసం దెసకు ఎలా మరలిపోగలరు, అల్లాహ్ వాక్యాలు మీకు వినిపించబడుతూ ఉన్నప్పుడు, ఆయన ప్రవక్త మీ మధ్య ప్రత్యక్షంగా ఉన్నప్పుడు? అల్లాహ్ ను గట్టిగా పట్టుకునేవాడికి తప్పకుండా రుజుమార్గం లభిస్తుంది.

Syed Abul Aala Maudoodi

ఆల్-ఇమ్రాన్

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ حَقَّ تُقَاتِهِ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسْلِمُونَ102

విశ్వసించిన ప్రజలారా! అల్లాహ్ కు ఏవిధంగా భయపడాలో, ఆ విధంగా భయపడండి. ముస్లిములుగా తప్ప మీరు మరణించకండి.

Syed Abul Aala Maudoodi