అన్-నిసా

۞ لَّا يُحِبُّ اللَّهُ الْجَهْرَ بِالسُّوءِ مِنَ الْقَوْلِ إِلَّا مَن ظُلِمَ ۚ وَكَانَ اللَّهُ سَمِيعًا عَلِيمًا148

అన్యాయం జరిగితే తప్ప, మనిషి చెడు పలకటాన్ని అల్లాహ్ ఇష్టపడడు. అల్లాహ్ అన్నీ వినేవాడూ అన్నీ తెలిసినవాడూనూ.

Syed Abul Aala Maudoodi

అన్-నిసా

إِن تُبْدُوا خَيْرًا أَوْ تُخْفُوهُ أَوْ تَعْفُوا عَن سُوءٍ فَإِنَّ اللَّهَ كَانَ عَفُوًّا قَدِيرًا149

(అన్యాయం జరిగితే చెడు పలికే హక్కు మీకు ఉంది) అయి నప్పటికీ మీరు బహిరంగంగానూ, చాటుగానూ మేలే చేస్తూపోతే లేదా కనీసం చెడును క్షమతో ఉపేక్షిస్తే అల్లాహ్ (గుణం కూడా ఇదే, ఆయన) క్షమించేవాడు. (వాస్తవానికి ఆయన శిక్షించే) శక్తి కలవాడు కూడ.

Syed Abul Aala Maudoodi

అన్-నిసా

إِنَّ الَّذِينَ يَكْفُرُونَ بِاللَّهِ وَرُسُلِهِ وَيُرِيدُونَ أَن يُفَرِّقُوا بَيْنَ اللَّهِ وَرُسُلِهِ وَيَقُولُونَ نُؤْمِنُ بِبَعْضٍ وَنَكْفُرُ بِبَعْضٍ وَيُرِيدُونَ أَن يَتَّخِذُوا بَيْنَ ذَٰلِكَ سَبِيلًا150

అల్లాహ్ ను, ఆయన ప్రవక్తలను తిరస్కరించేవారూ, అల్లాహ్ ఆయన ప్రవక్తల మధ్య భేదభావం చూపేవారూ, ‘‘మేము కొందరిని విశ్వసిస్తాము, మరికొందరిని విశ్వసించము’’ అని అనే వారూ, అవిశ్వాస విశ్వాసాలకు మధ్య ఒక (కొత్త) మార్గాన్ని కనిపెట్టాలనే ఉద్దేశ్యం కలవారు

Syed Abul Aala Maudoodi

అన్-నిసా

أُولَـٰئِكَ هُمُ الْكَافِرُونَ حَقًّا ۚ وَأَعْتَدْنَا لِلْكَافِرِينَ عَذَابًا مُّهِينًا151

వారు అందరూ పరమ అవిశ్వాసులే. అటువంటి అవిశ్వాసుల కొరకు మేము అత్యంత అవమానకరమైన శిక్షను సిద్ధంచేసి ఉంచాము.

Syed Abul Aala Maudoodi

అన్-నిసా

وَالَّذِينَ آمَنُوا بِاللَّهِ وَرُسُلِهِ وَلَمْ يُفَرِّقُوا بَيْنَ أَحَدٍ مِّنْهُمْ أُولَـٰئِكَ سَوْفَ يُؤْتِيهِمْ أُجُورَهُمْ ۗ وَكَانَ اللَّهُ غَفُورًا رَّحِيمًا152

దీనికి భిన్నంగా అల్లాహ్ ను, ఆయన ప్రవక్తలందరినీ విశ్వసించి, వారి మధ్య భేదభావం చూపని వారికి మేము వారి ప్రతిఫలాన్ని తప్పక ప్రసాదిస్తాము. అల్లాహ్ అధికంగా మన్నించేవాడూ, అనన్యంగా కరుణించేవాడూను.

Syed Abul Aala Maudoodi

అన్-నిసా

يَسْأَلُكَ أَهْلُ الْكِتَابِ أَن تُنَزِّلَ عَلَيْهِمْ كِتَابًا مِّنَ السَّمَاءِ ۚ فَقَدْ سَأَلُوا مُوسَىٰ أَكْبَرَ مِن ذَٰلِكَ فَقَالُوا أَرِنَا اللَّهَ جَهْرَةً فَأَخَذَتْهُمُ الصَّاعِقَةُ بِظُلْمِهِمْ ۚ ثُمَّ اتَّخَذُوا الْعِجْلَ مِن بَعْدِ مَا جَاءَتْهُمُ الْبَيِّنَاتُ فَعَفَوْنَا عَن ذَٰلِكَ ۚ وَآتَيْنَا مُوسَىٰ سُلْطَانًا مُّبِينًا153

ప్రవక్తా! ఈ గ్రంథ ప్రజలు ఒకవేళ ఈనాడు ‘‘ఆకాశం నుండి ఏదైనా గ్రంథాన్ని మాపై అవతరింపచెయ్యి’’ అని నిన్ను కోరుతున్నట్లయితే ఇంతకంటే పరమ ఘోరమైన కోరికలనే వారు పూర్వం మూసాను కోరివున్నారు. ఆయనను వారు, ‘‘అల్లాహ్ ను మాకు ప్రత్యక్షంగా చూపించు’’ అనే కోరారు. వారి ఈ తలబిరుసుతనం కారణంగానే వారిపై అకస్మాత్తుగా పిడుగు విరుచుకుపడిరది. తరువాత వారు ఆవుదూడను తమ ఆరాధ్యదైవంగా చేసుకున్నారు. వాస్తవానికి వారు స్పష్టమైన సూచనలు చూసివున్నారు. దానిక్కూడా మేము వారిని మన్నించాము. మేము మూసాకు స్పష్టమైన ఆజ్ఞను ప్రసాదించాము.

Syed Abul Aala Maudoodi

అన్-నిసా

وَرَفَعْنَا فَوْقَهُمُ الطُّورَ بِمِيثَاقِهِمْ وَقُلْنَا لَهُمُ ادْخُلُوا الْبَابَ سُجَّدًا وَقُلْنَا لَهُمْ لَا تَعْدُوا فِي السَّبْتِ وَأَخَذْنَا مِنْهُم مِّيثَاقًا غَلِيظًا154

వారిపై తూర్‌ పర్వతమెత్తి (ఈ ఆజ్ఞకు మేము విధేయులమై ఉంటామనే) ప్రమాణాన్ని తీసుకున్నాము. సజ్‌దా చేస్తూ (నగర) ద్వారంలోకి ప్రవేశించండి అని మేము వారిని ఆజ్ఞాపించాము. ‘సబ్బత్‌’ శాసనాన్ని ఉల్లంఘించకూడదని మేము వారికి చెప్పాము. దీనికిగాను వారినుండి గట్టి ప్రమాణం తీసుకున్నాము.

Syed Abul Aala Maudoodi

అన్-నిసా

فَبِمَا نَقْضِهِم مِّيثَاقَهُمْ وَكُفْرِهِم بِآيَاتِ اللَّهِ وَقَتْلِهِمُ الْأَنبِيَاءَ بِغَيْرِ حَقٍّ وَقَوْلِهِمْ قُلُوبُنَا غُلْفٌ ۚ بَلْ طَبَعَ اللَّهُ عَلَيْهَا بِكُفْرِهِمْ فَلَا يُؤْمِنُونَ إِلَّا قَلِيلًا155

చివరకు, వారు ప్రమాణ భంగం చెయ్యటం వల్లా, అల్లాహ్ ఆయతులను నిరాకరించటంవల్లా, ఎంతోమంది ప్రవక్తలను అన్యాయంగా హత్య చేయటం వల్లా, ఇంకా ‘‘మా హృదయాలు గలేబులలో సురక్షితంగా ఉన్నాయి’’ అని చెప్పటం వల్లా, - యథార్థం ఏమిటంటే వారు అసత్యాన్ని అనుసరించిన కారణంగా అల్లాహ్ వారి హృదయాలకు ముద్రవేశాడు. కనుకనే వారు తక్కువగా విశ్వసిస్తారు

Syed Abul Aala Maudoodi

అన్-నిసా

وَبِكُفْرِهِمْ وَقَوْلِهِمْ عَلَىٰ مَرْيَمَ بُهْتَانًا عَظِيمًا156

వారు తమ అవిశ్వాసంలో ఎంత ముందుకు పోయారంటే, మర్యమ్‌పైనే తీవ్రమైన నిందమోపారు.

Syed Abul Aala Maudoodi

అన్-నిసా

وَقَوْلِهِمْ إِنَّا قَتَلْنَا الْمَسِيحَ عِيسَى ابْنَ مَرْيَمَ رَسُولَ اللَّهِ وَمَا قَتَلُوهُ وَمَا صَلَبُوهُ وَلَـٰكِن شُبِّهَ لَهُمْ ۚ وَإِنَّ الَّذِينَ اخْتَلَفُوا فِيهِ لَفِي شَكٍّ مِّنْهُ ۚ مَا لَهُم بِهِ مِنْ عِلْمٍ إِلَّا اتِّبَاعَ الظَّنِّ ۚ وَمَا قَتَلُوهُ يَقِينًا157

స్వయంగా, ‘‘మేము మసీప్‌ా, మర్యమ్‌ కుమా రుడైన ఈసా అనే దైవప్రవక్తను చంపాము’’ అని అన్నారు - వాస్తవానికి వారు ఆయనను చంపనూలేదు, శిలువపైకి ఎక్కించనూ లేదు. కాని ఆ విషయంలో వారు భ్రమకు గురిచెయ్యబడ్డారు. ఈ విషయం గురించి అభిప్రాయభేదం వ్యక్తం చేసిన వారు కూడా సందేహానికి లోనయ్యారు. దీనిని గురించి వారికి అసలు ఏమీ తెలియదు. వారు కేవలం ఊహనే అనుసరిస్తున్నారు. వారు అతనిని నిశ్చయంగా చంపలేదు.

Syed Abul Aala Maudoodi