అల్-మాయిదా

۞ لَتَجِدَنَّ أَشَدَّ النَّاسِ عَدَاوَةً لِّلَّذِينَ آمَنُوا الْيَهُودَ وَالَّذِينَ أَشْرَكُوا ۖ وَلَتَجِدَنَّ أَقْرَبَهُم مَّوَدَّةً لِّلَّذِينَ آمَنُوا الَّذِينَ قَالُوا إِنَّا نَصَارَىٰ ۚ ذَٰلِكَ بِأَنَّ مِنْهُمْ قِسِّيسِينَ وَرُهْبَانًا وَأَنَّهُمْ لَا يَسْتَكْبِرُونَ82

విశ్వాసుల పట్ల విరోధం విషయంలో, నీవు యూదులనూ, ముష్రిక్కులనూ అందరికంటే ఎక్కువ ప్రచండులుగా కనుగొంటావు. విశ్వాసులపట్ల మైత్రి విషయంలో ‘‘మేము క్రైస్తవులం’’ అని అన్నవారిని అత్యంత సన్నిహితులుగా చూస్తావు. దీనికి కారణం ఏమిటంటే వారిలో దైవభక్తిగల విద్వాంసులూ, ప్రపంచాన్ని పరిత్యజించిన సన్యాసులూ ఉన్నారు. ఇంకా వారిలో అహంభావం లేదు.

Syed Abul Aala Maudoodi

అల్-మాయిదా

وَإِذَا سَمِعُوا مَا أُنزِلَ إِلَى الرَّسُولِ تَرَىٰ أَعْيُنَهُمْ تَفِيضُ مِنَ الدَّمْعِ مِمَّا عَرَفُوا مِنَ الْحَقِّ ۖ يَقُولُونَ رَبَّنَا آمَنَّا فَاكْتُبْنَا مَعَ الشَّاهِدِينَ83

ప్రవక్తపై అవతరించిన ఈ గ్రంథాన్ని వారు విన్నప్పుడు, సత్యాన్ని గ్రహించిన కారణంగా వారి కళ్ళు అశ్రువులతో చెమ్మగిల్లటం నీవు చూస్తావు. వారు ఇలా అనేస్తారు : ‘‘ప్రభూ! మేము విశ్వసించాము. మా పేర్లను సాక్ష్యం ఇచ్చేవారిలో వ్రాయి.’’

Syed Abul Aala Maudoodi

అల్-మాయిదా

وَمَا لَنَا لَا نُؤْمِنُ بِاللَّهِ وَمَا جَاءَنَا مِنَ الْحَقِّ وَنَطْمَعُ أَن يُدْخِلَنَا رَبُّنَا مَعَ الْقَوْمِ الصَّالِحِينَ84

ఇంకా వారు ఇలా అంటారు : ‘‘మా ప్రభువు మమ్మల్ని సజ్జనులలో చేర్చాలనే ఆకాంక్ష మాకు ఉన్నప్పుడు మేము అల్లాహ్ ను ఎందుకు విశ్వసించకూడదు? మా వద్దకు వచ్చిన సత్యాన్ని ఎందుకు స్వీకరించకూడదు?’’

Syed Abul Aala Maudoodi

అల్-మాయిదా

فَأَثَابَهُمُ اللَّهُ بِمَا قَالُوا جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا ۚ وَذَٰلِكَ جَزَاءُ الْمُحْسِنِينَ85

వారు ఇలా పలికిన కారణంగా అల్లాహ్ వారికి కింద కాలువలు ప్రవహించే ఉద్యానవనాలను ప్రసాదించాడు. వారు అక్కడ కలకాలం ఉంటారు. సద్వర్తనులకు లభించే ప్రతిఫలం ఇది.

Syed Abul Aala Maudoodi

అల్-మాయిదా

وَالَّذِينَ كَفَرُوا وَكَذَّبُوا بِآيَاتِنَا أُولَـٰئِكَ أَصْحَابُ الْجَحِيمِ86

ఇక మా ఆయత్తులను స్వీకరించటానికి తిరస్క రించేవారూ, వాటిని అసత్యాలుగా చిత్రించి నిరాకరించేవారూ నరకానికి అర్హులు.

Syed Abul Aala Maudoodi

అల్-మాయిదా

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُحَرِّمُوا طَيِّبَاتِ مَا أَحَلَّ اللَّهُ لَكُمْ وَلَا تَعْتَدُوا ۚ إِنَّ اللَّهَ لَا يُحِبُّ الْمُعْتَدِينَ87

విశ్వాసులారా! అల్లాహ్ మీ కొరకు ధర్మ సమ్మతం చేసిన పరిశుద్ధ వస్తువులను నిషిద్ధం చేసుకోకండి. హద్దులను అతిక్రమించకండి. మితిమీరి ప్రవర్తించేవారంటే అల్లాహ్ కు ఏమాత్రం ఇష్టం ఉండదు.

Syed Abul Aala Maudoodi

అల్-మాయిదా

وَكُلُوا مِمَّا رَزَقَكُمُ اللَّهُ حَلَالًا طَيِّبًا ۚ وَاتَّقُوا اللَّهَ الَّذِي أَنتُم بِهِ مُؤْمِنُونَ88

అల్లాహ్ మీకు ప్రసాదించిన ధర్మసమ్మతమూ, పరిశుద్ధమూ అయిన ఆహారాన్ని తినండి, త్రాగండి. మీరు విశ్వసించిన దైవం పట్ల అవిధేయతకు దూరంగా ఉండండి.

Syed Abul Aala Maudoodi

అల్-మాయిదా

لَا يُؤَاخِذُكُمُ اللَّهُ بِاللَّغْوِ فِي أَيْمَانِكُمْ وَلَـٰكِن يُؤَاخِذُكُم بِمَا عَقَّدتُّمُ الْأَيْمَانَ ۖ فَكَفَّارَتُهُ إِطْعَامُ عَشَرَةِ مَسَاكِينَ مِنْ أَوْسَطِ مَا تُطْعِمُونَ أَهْلِيكُمْ أَوْ كِسْوَتُهُمْ أَوْ تَحْرِيرُ رَقَبَةٍ ۖ فَمَن لَّمْ يَجِدْ فَصِيَامُ ثَلَاثَةِ أَيَّامٍ ۚ ذَٰلِكَ كَفَّارَةُ أَيْمَانِكُمْ إِذَا حَلَفْتُمْ ۚ وَاحْفَظُوا أَيْمَانَكُمْ ۚ كَذَٰلِكَ يُبَيِّنُ اللَّهُ لَكُمْ آيَاتِهِ لَعَلَّكُمْ تَشْكُرُونَ89

మీరు చేసే అర్థం లేని ప్రమాణాలను గురించి అల్లాహ్ మిమ్మల్ని పట్టుకోడు. కాని మీరు బుద్ధి పూర్వకంగా చేసే ప్రమాణాలను గురించి ఆయన మిమ్మల్ని తప్పకుండా ప్రశ్నిస్తాడు. (అటువంటి ప్రమాణభంగానికి) పరిహారం ఏమిటంటే మీరు మీ ఆలుబిడ్డలకు తినిపించే మామూలు భోజనం పదిమంది పేదలకు పెట్టటం లేదా వారికి కట్టుబట్టలు ఇవ్వటం లేదా ఒక బానిసను స్వతంత్రునిగా చెయ్యటం. ఈ స్తోమతలేనివారు మూడు రోజుల పాటు ఉపవాసం ఉండాలి. మీరు ప్రమాణం చేసి భంగపరిస్తే, మీ ప్రమాణాలకు పరిహారం ఇది. మీరు మీ ప్రమాణాలను కాపాడుకోండి. మీరు కృతజ్ఞతలు తెలుపుతారని అల్లాహ్ ఈ విధంగా తన ఆజ్ఞలను మీ కొరకు విశదం చేస్తున్నాడు.

Syed Abul Aala Maudoodi

అల్-మాయిదా

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِنَّمَا الْخَمْرُ وَالْمَيْسِرُ وَالْأَنصَابُ وَالْأَزْلَامُ رِجْسٌ مِّنْ عَمَلِ الشَّيْطَانِ فَاجْتَنِبُوهُ لَعَلَّكُمْ تُفْلِحُونَ90

విశ్వాసులారా! సారాయి, జూదం, దైవేతర మందిరాలు, పాచికల ద్వారా జోస్యం - ఇవన్నీ అసహ్యకరమైన షైతాను పనులు. వాటిని విసర్జించండి. మీకు సాఫల్య భాగ్యం కలిగే అవకాశం ఉంది.

Syed Abul Aala Maudoodi

అల్-మాయిదా

إِنَّمَا يُرِيدُ الشَّيْطَانُ أَن يُوقِعَ بَيْنَكُمُ الْعَدَاوَةَ وَالْبَغْضَاءَ فِي الْخَمْرِ وَالْمَيْسِرِ وَيَصُدَّكُمْ عَن ذِكْرِ اللَّهِ وَعَنِ الصَّلَاةِ ۖ فَهَلْ أَنتُم مُّنتَهُونَ91

షైతాను సారాయి, జూదాల ద్వారా మీ మధ్య విరోధ విద్వేషాలను సృష్టించాలనీ, మిమ్మల్ని అల్లాహ్ స్మరణ నుండీ, నమాజు నుండీ వారించాలని కోర్తాడు. కనుక మీరు వీటిని మానుకుంటారా లేదా?

Syed Abul Aala Maudoodi