سورة الأنعام

۞ وَلَوْ أَنَّنَا نَزَّلْنَا إِلَيْهِمُ الْمَلَائِكَةَ وَكَلَّمَهُمُ الْمَوْتَىٰ وَحَشَرْنَا عَلَيْهِمْ كُلَّ شَيْءٍ قُبُلًا مَّا كَانُوا لِيُؤْمِنُوا إِلَّا أَن يَشَاءَ اللَّهُ وَلَـٰكِنَّ أَكْثَرَهُمْ يَجْهَلُونَ111

మేము వారిపై దైవదూతలను సైతం అవతరింపజేసినా, మరణించినవారు వారితో మాట్లాడినా, మేము వారి కళ్ళముందు ప్రపంచంలోని వస్తువులు ఎన్నింటిని ప్రోగుజేసి పెట్టినా, అప్పుడుకూడా వారు విశ్వసించేవారు కాదు, (వారు విశ్వసించాలని) అల్లాహ్ సంకల్పిస్తే తప్ప. కాని వారిలో చాలామంది అజ్ఞానపు మాటలు పలుకుతారు.

Syed Abul Aala Maudoodi

سورة الأنعام

وَكَذَٰلِكَ جَعَلْنَا لِكُلِّ نَبِيٍّ عَدُوًّا شَيَاطِينَ الْإِنسِ وَالْجِنِّ يُوحِي بَعْضُهُمْ إِلَىٰ بَعْضٍ زُخْرُفَ الْقَوْلِ غُرُورًا ۚ وَلَوْ شَاءَ رَبُّكَ مَا فَعَلُوهُ ۖ فَذَرْهُمْ وَمَا يَفْتَرُونَ112

మేము ఇదేవిధంగా ఎల్లప్పుడూ మానవ షైతానులను జిన్నాతు షైతానులను ప్రతి ప్రవక్తకు శత్రువులుగా చేశాము. ప్రజలను వంచించే నిమిత్తం వారు సొంపైన మాటలను పరస్పరం ప్రేరేపించుకుంటారు. వారు ఈ విధంగా చెయ్యకూడదని నీ ప్రభువు సంకల్పమేఅయితే, వారు ఎన్నటికీ అలా చెయ్యరు. కనుక వారిని వారి మానాన వదలిపెట్టు, అబద్ధపు నిందారోపణలు చేయటానికి.

Syed Abul Aala Maudoodi

سورة الأنعام

وَلِتَصْغَىٰ إِلَيْهِ أَفْئِدَةُ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ وَلِيَرْضَوْهُ وَلِيَقْتَرِفُوا مَا هُم مُّقْتَرِفُونَ113

(మేము వారిని ఇదంతా ఎందుకు చెయ్యనిస్తున్నామంటే) పరలోకాన్ని విశ్వసించని వారి హృదయాలు ఆ (అందమైన మోసం) వైపునకు మొగ్గాలని, వారు అదంటే ఇష్టపడాలని, వారు తాము ఆర్జించుకోదలచిన చెడులను ఆర్జించుకోవాలని.

Syed Abul Aala Maudoodi

سورة الأنعام

أَفَغَيْرَ اللَّهِ أَبْتَغِي حَكَمًا وَهُوَ الَّذِي أَنزَلَ إِلَيْكُمُ الْكِتَابَ مُفَصَّلًا ۚ وَالَّذِينَ آتَيْنَاهُمُ الْكِتَابَ يَعْلَمُونَ أَنَّهُ مُنَزَّلٌ مِّن رَّبِّكَ بِالْحَقِّ ۖ فَلَا تَكُونَنَّ مِنَ الْمُمْتَرِينَ114

పరిస్థితి ఇదైనప్పుడు నేను అల్లాహ్ను కాదని తీర్పు చెప్పే మరొకడికోసం అన్వేషించాలా, వాస్తవానికి ఆయన పూర్తి వివరాలతో మీ వద్దకు గ్రంథాన్ని పంపినప్పుడు? మేము (నీకు పూర్వం) గ్రంథం ఇచ్చిన వారికి తెలుసు, ఈ గ్రంథం నీ ప్రభువు తరఫునుండే సత్యం ఆధారంగా అవతరించిందని. కనుక నీవు శంకించేవారిలో చేరిపోకు.

Syed Abul Aala Maudoodi

سورة الأنعام

وَتَمَّتْ كَلِمَتُ رَبِّكَ صِدْقًا وَعَدْلًا ۚ لَّا مُبَدِّلَ لِكَلِمَاتِهِ ۚ وَهُوَ السَّمِيعُ الْعَلِيمُ115

సత్యం రీత్యా న్యాయం రీత్యా నీ ప్రభువు వాక్కు పరిపూర్ణమైనది. ఆయన ఆదేశాలను మార్చేవాడు ఎవడూ లేడు. ఆయన అన్నీ వింటాడు. ఆయనకు అంతా తెలుసు.

Syed Abul Aala Maudoodi

سورة الأنعام

وَإِن تُطِعْ أَكْثَرَ مَن فِي الْأَرْضِ يُضِلُّوكَ عَن سَبِيلِ اللَّهِ ۚ إِن يَتَّبِعُونَ إِلَّا الظَّنَّ وَإِنْ هُمْ إِلَّا يَخْرُصُونَ116

ప్రవక్తా! ఒకవేళ పుడమిపై నివసించే ప్రజలలో అధికసంఖ్యాకులు చెప్పినట్లుగా నీవు నడిస్తే, వారు నిన్ను అల్లాహ్ మార్గం నుండి తొలగిస్తారు. వారు కేవలం అంచనాలను అనుసరిస్తారు, ఊహాకల్పనలుచేస్తారు.

Syed Abul Aala Maudoodi

سورة الأنعام

إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ مَن يَضِلُّ عَن سَبِيلِهِ ۖ وَهُوَ أَعْلَمُ بِالْمُهْتَدِينَ117

వాస్తవానికి నీ ప్రభువుకే బాగా తెలుసు, ఎవరు ఆయన మార్గం నుండి వైదొలగి ఉన్నారో, ఎవరు రుజుమార్గంపై ఉన్నారో.

Syed Abul Aala Maudoodi

سورة الأنعام

فَكُلُوا مِمَّا ذُكِرَ اسْمُ اللَّهِ عَلَيْهِ إِن كُنتُم بِآيَاتِهِ مُؤْمِنِينَ118

ఇక మీకు అల్లాహ్ ఆయతులపై విశ్వాసమే ఉంటే, అల్లాహ్ నామం స్మరించబడిన పశువు మాంసం తినండి.

Syed Abul Aala Maudoodi

سورة الأنعام

وَمَا لَكُمْ أَلَّا تَأْكُلُوا مِمَّا ذُكِرَ اسْمُ اللَّهِ عَلَيْهِ وَقَدْ فَصَّلَ لَكُم مَّا حَرَّمَ عَلَيْكُمْ إِلَّا مَا اضْطُرِرْتُمْ إِلَيْهِ ۗ وَإِنَّ كَثِيرًا لَّيُضِلُّونَ بِأَهْوَائِهِم بِغَيْرِ عِلْمٍ ۗ إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ بِالْمُعْتَدِينَ119

అల్లాహ్ పేరు స్మరించబడిన వస్తువును మీరు తినకపోవటానికి అసలు కారణం ఏమిటి? వాస్తవానికి గత్యంతరం లేని సంకట పరిస్థితులలో తప్ప, మిగతా అన్ని పరిస్థితులలోనూ అల్లాహ్ ఏ వస్తువుల వినియోగాన్ని నిషేధించాడో, వాటి వివరాలను మీకు ఆయన ఇదివరకే తెలియజేశాడు. చాలామంది ప్రజలు జ్ఞానం లేకపోయినా కేవలం తమ కోరికలకు లోనయి అపమార్గం పట్టించే విషయాలను మాట్లాడుతూ ఉంటారు. ఈ హద్దులు మీరే వారిని నీ ప్రభువు బాగా ఎరుగును.

Syed Abul Aala Maudoodi

سورة الأنعام

وَذَرُوا ظَاهِرَ الْإِثْمِ وَبَاطِنَهُ ۚ إِنَّ الَّذِينَ يَكْسِبُونَ الْإِثْمَ سَيُجْزَوْنَ بِمَا كَانُوا يَقْتَرِفُونَ120

మీరు బహిరంగ పాపాలకూ దూరంగా ఉండండి. రహస్య పాపాలకూ దూరంగా ఉండండి. పాపాలను సంపాదించుకునే వారు తమ ఈ సంపాదనకు ప్రతిఫలం పొందితీరుతారు.

Syed Abul Aala Maudoodi